ఈ నెలలో అన్ని ఆదివారాలు, రెండవ శనివారం కూడా సబ్ రిజిష్ట్రార్ ఆఫీసులు ఓపెన్ : సీఎస్

CS Meeting with Registration and Stamps Department Employees, CS Somesh Kumar, CS Somesh Kumar Meeting, CS Somesh Kumar Meeting with Registration and Stamps Department Employees Association, Registration and Stamps Department Employees, Registration and Stamps Department Employees Association

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ ద్వారా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు క్లియర్ అయ్యేలా గత రెండు నెలలుగా మంచి సేవలు అందిస్తున్నందుకు రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అభినందించారు. రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు గురువారం నాడు సీఎస్ సోమేశ్ కుమార్ ను బి.ఆర్.కె.ఆర్ భవన్ లో కలిసారు. రిజిస్ట్రేషన్ శాఖలో అన్ని స్థాయిలలో అతి తక్కువ సమయంలో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరియు సీఎస్ సోమేశ్ కుమార్ లకు అసోసియేషన్ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రిజిస్ట్రేషన్ లకు గల డిమాండ్ మరియు ఈ ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్నందున మార్చి-2021 మాసంలో అన్ని ఆదివారాలు, రెండవ శనివారం పనిచేస్తామని అసోసియేషన్ సభ్యులు సీఎస్ కు తెలిపారు.

అందుకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాలను అన్ని ఆదివారాలు (మార్చి 7th, 14th, 21st , 28th ) మరియు రెండవ శనివారం (మార్చి 13th ) లలో కూడా పనిచేసేందుకు తెరిచివుంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కావున అన్ని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాలు మార్చి మాసంలో మహాశివరాత్రి (మార్చి 11th ) మరియు హోళి (మార్చి 29th ) రోజులలో తప్ప మిగతా అన్ని రోజులలో తెరిచివుంటాయని, ఈ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో స్టాంపులు, రిజిష్ట్రేషన్ల కమీషనర్ మరియు ఐజి శేషాద్రి, అసోసియేషన్ ప్రెసిడెంట్ స్ధిత ప్రజ్ఞ, కన్వీనర్ మరియు టిఎన్జిఓ హైదరాబాద్ నగర అద్యక్షుడు ముజిబ్, అసోసియేట్ ప్రెసిడెంట్ సహదేవ్, అసోసియేషన్ సభ్యులు ప్రణయ్ కుమార్, సిరాజ్ అన్వర్, నరేష్ గౌడ్ పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =