ఏపీలో కొనసాగుతున్న బంద్: డిపోల్లోనే బస్సులు, విద్యాసంస్థలు మూసివేత

#VizagSteelPlant, AP Bandh, AP Bandh News, Centre Decision on Vizag Steel Plant, Mango News, Privatisation of Visakhapatnam Steel Plant, Privatisation of Visakhapatnam Steel Plant News, privatisation of Vizag Steel Plant, Protest Against Vizag Steel Plant Privatisation, Protest Going on Statewide Against Vizag Steel Plant Privatisation, Protest to Centre Decision on Vizag Steel Plant, Visakhapatnam, Visakhapatnam Steel Plant, Vizag Steel Plant, Vizag Steel Plant Privatisation, Vizag Steel Plant Privatisation Issue, Vizag Steel Plant staff

విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. ముందుగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి, కార్మిక సంఘాలు రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వగా, టీడీపీ, వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ సహా పలు ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, వ్యాపార సంఘాలు మద్ధతు ప్రకటించాయి. అలాగే కార్మిక సంఘాలు తలపెట్టిన బంద్ కు ఏపీ ప్రభుత్వం కూడా సంఘీభావం ప్రకటించింది. రాష్ట్ర బంద్ నేపథ్యంలో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. మధ్యాహ్నం ఒంటిగంట తరవాత యధావిధిగా బస్సులు నడవనున్నాయి. అలాగే రాష్ట్రంలో పాఠశాలలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. వ్యాపార సంస్థలు, దుకాణాలను కూడా స్వచ్చంధంగా మూసివేస్తున్నారు.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంతవరకు పోరాటం కొనసాగుతుందని కార్మిక సంఘాలు వెల్లడించాయి. మరోవైపు పలు పార్టీల నాయకులు విశాఖపట్నం చేరుకొని కార్మిక సంఘాలతో కలిసి ప్రత్యక్షంగా ఈ బంద్ లో పాల్గొంటున్నారు. ఉద్యోగులు, కార్మిక సంఘాల నేతలు, ప్రజాసంఘాల నేతలు, పలు పార్టీల నేతలు బస్ స్టాండ్ ల వద్ద, రహదారులపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 16 =