హైదరాబాద్ మైనర్ బాలిక ఘటనలో ట్విస్ట్.. ఫోటోలు, వీడియోలు విడుదల చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌పై కేసు నమోదు

Hyderabad Case Files Against BJP MLA Raghunandan Rao For Releasing Photos and Videos in Minor Girl Incident, Case Files Against BJP MLA Raghunandan Rao For Releasing Photos and Videos in Minor Girl Incident, BJP MLA Raghunandan Rao For Releasing Photos and Videos in Minor Girl Incident, Hyderabad Case Files Against BJP MLA Raghunandan Rao, MLA Raghunandan Rao For Releasing Photos and Videos in Minor Girl Incident, Raghunandan Rao For Releasing Photos and Videos in Minor Girl Incident, Case Files Against BJP MLA Raghunandan Rao, Minor Girl Incident, BJP MLA Raghunandan Rao, MLA Raghunandan Rao, Raghunandan Rao, BJP MLA, Hyderabad Minor Girl Incident, Hyderabad Minor Girl Incident News, Hyderabad Minor Girl Incident Latest News, Hyderabad Minor Girl Incident Latest Updates, Hyderabad Minor Girl Incident Live Updates, Mango News, Mango News Telugu,

హైదరాబాద్ మైనర్ బాలిక ఘటనలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఈ ఘటనకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదైంది. రెండు రోజుల కిందట ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో మైనర్ బాలిక ఘటనకు చెందినవిగా చూపుతూ కొన్ని ఫోటోలు, వీడియోలు విడుదల చేయడం తెలిసిందే. దీనిపై తాజాగా పోలీసులు రఘునందన్‌పై అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కోర్టుల ఆదేశాల ప్రకారం ఇలాంటి ఘటనలలో బాధితుల ఫోటోలు కానీ, వీడియోలు కానీ పబ్లిక్ గా విడుదల చేయకూడదని నిబంధన ఉందని, అయితే రఘునందన్‌ దీనిని ఉల్లఘించారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. సైబర్ క్రైమ్ విభాగం ఆదివారం సుమోటోగా కాగ్నిజెన్స్‌ తీసుకుని కేసు నమోదు చేసింది.

అయితే, సామూహిక అత్యాచారం కేసుకు సంబంధించి మైనర్ బాలిక వీడియోను విడుదల చేసినందుకు తనపై కేసు నమోదవడంపై ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందిస్తూ.. అన్ని పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. బాధితురాలి ముఖాన్ని గానీ, వ్యక్తి ఎవరో గానీ తాను వెల్లడించలేదని అన్నారు. ఘటనలో బాధితురాలికి న్యాయం జరిగేలా నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయకుండా, నాపై కేసు పెట్టాలని కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు డిమాండ్ చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. వాస్తవానికి నేను ఆ వీడియోను విడుదల చేయడానికి ఒక రోజు ముందు, అన్ని తెలుగు వార్తా ఛానెల్‌లు బాధితురాలితో సహా కీలక నిందితుడిని చూపిస్తున్న సీసీటీవీ ఫుటేజీని టెలికాస్ట్ చేశాయని ఎమ్మెల్యే గుర్తు చేశారు.

కాగా మైనర్ గ్యాంగ్ రేప్ బాధితురాలి సన్నిహిత వీడియోను బిజెపి ఎమ్మెల్యే విడుదల చేసినందుకు నిరసనగా మాజీ బిజెపి కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో సోమవారం ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు మరియు బిజెపి కార్యకర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. మైనర్ బాలిక సన్నిహిత వీడియోలను విడుదల చేసినందుకు రఘునందన్ రావుపై కేసు నమోదు చేయాలని ఎన్‌ఎస్‌యుఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇక జూబ్లీహిల్స్‌లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించి వీడియోలను షేర్ చేసినందుకు ఓల్డ్ సిటీకి చెందిన ఓ జర్నలిస్టుకు హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగం నోటీసులు అందజేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =