నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధింపు

In the View of New Year's Day Celebrations, Telangana Police Issued Certain Restrictions in Hyd,Mango News,Mango News Telugu,New Year 2021,Traffic Diversions,New Years Eve,New Years Eve Guidelines,Rachakonda Police,Hyderabad City Police,Hyderabad,Police To Keep An Eye On Drunk Drivers,Traffic Restrictions On New Year’s Eve,New Year Celebrations,Cyberabad Police,NYE,Drunk Drivers,Hyderabad Police,Drunk Drivers Beware Of Hyderabad Police,Drunk Drivers Beware Of Cyberabad Police During NYE,New Year Day,New Year Celebraions,New Year,Celebraions,New Year Celebraions 2021,New Year Celebraions Drunk Drivers,Telangana Police,New Year's Day Celebrations

నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా డిసెంబర్ 31, గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు నగరంలోని సైబరాబాద్‌, హైదరాబాద్‌, రాచకొండ పరిధిలోని పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై పోలీసుశాఖ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించింది. నగరంలోని బేగంపేట ఫ్లైఓవర్ మినహా సైబర్‌ టవర్స్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ 1 అండ్ 2, జేఎన్‌టీయూ, మైండ్‌ స్పేస్‌ ఫ్లై ఓవర్స్‌, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నిషేధించారు. అలాగే ట్యాంక్‌ బండ్‌, ఎన్టీఆర్ మార్గ్‌, నెక్టెస్‌ రోడ్డు మార్గాల్లో కూడా ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు.

ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్‌), పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల వాహనాలను తప్ప, ఇతర వాహనాలను అనుమతించరని పేర్కొన్నారు. ఆటో, క్యాబ్‌, ట్యాక్సీ డ్రైవర్లు అన్ని డాక్యూమెంట్స్ దగ్గర ఉంచుకుని తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని సూచించారు. ఎలాంటి కారణాలు లేకుండా ట్రిప్పులు రద్దు చేయడం, ప్రజలకు సేవలు నిరాకరించినట్టు కంప్లైంట్స్ వస్తే రూ.500 జరిమానా విధించనున్నట్టు తెలిపారు.

బార్లు, పబ్బులు, క్లబ్బులలో మద్యం త్రాగిన వారిని అక్కడి నుంచే వెళ్లే సమయంలో వాళ్లే వాహనాలను నడపడానికి అనుమతించకూడదని, వారిని ఇళ్లకు పంపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఆయా యాజమాన్యాలే చేయాలనీ, నిబంధనలను అతిక్రమించినట్టు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు నగరవ్యాప్తంగా 3 వేల మందికిపైగా పోలీసులతో ప్రత్యేక డ్రంకెన్‌ డ్రైవ్‌లు నిర్వహించి, తనిఖీలు చేపట్టనున్నారు. నగర ప్రజలంతా కరోనా నిబంధనలను పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని తెలంగాణ పోలీస్ శాఖ సూచించింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 3 =