అక్కడ ఎంఐఎం పోటీ కాంగ్రెస్‌ను దెబ్బకొట్టడానికేనా?

Is MIMs contest there to hurt Congress,Is MIMs contest,There to hurt Congress,Investigation of competition in digital markets,Mango News,Mango News Telugu,mim, asaduddin owaisi, congress, Revanth Reddy, Telangana Assembly Elections,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Telangana News,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates,Telangana Assembly Elections Live News,Revanth Reddy Latest News,Revanth Reddy Latest Updates
mim, asaduddin owaisi, congress, revanth reddy, telangana assembly elections

పాతబస్తీలోని చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా, కార్వాన్‌, నాంపల్లి, మలక్‌పేట స్థానాల్లో మిగతా పార్టీలు పోటీలో నిలబడ్డా.. అవి నామమాత్రమే. ఏదో ఒక అద్భుతం జరిగితే కానీ.. వాటిలో ఎక్కడా ఎంఐఎంను కాదని మిగతా పార్టీలు గెలవవు.. గెలవలేవు. వీటితో పాటు మరో నియోజకవర్గంపై కూడా ఇప్పుడు ఎంఐఎం దృష్టి సారించింది. అదే జూబ్లీహిల్స్‌. అయితే.. అక్కడ గెలవడానికి కాదు.. కాంగ్రెస్‌ను ఓడించడానికే అన్న ప్రచారం జరుగుతోంది. అందుకు కారణాలూ ఉన్నాయి.

గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి ఎంఐఎం పోటీలో నిలబడ లేదు. నగరంలో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం ఇది. ఇక్కడ మైనార్టీలు కూడా ఎక్కువే. నిన్నటి మొన్నటి వరకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మాత్రమే ఇక్కడ ఎన్నికల బరిలో ఉంటాయని ఉంటారని అందరూ భావించారు. అనుకోకుండా ఎంఐఎం కూడా ఈసారి జూబ్లీహిల్స్‌ నుంచి అభ్యర్థిని ప్రకటించింది. 2014 ఎన్నికల్లో ఎంఐఎం మొదటి సారి పోటీ చేసి, ఓటమి పాలవ్వడంతో 2018లో ఆసక్తి కనబర్చలేదు.

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఏర్పడ్డాక తొలిసారిగా 2009 ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని ఎంఐఎం భావించింది. నవీన్‌యాదవ్‌కు టికెట్టు కేటాయించగా స్కూట్నీలో నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. 2014 మైనారిటీ, మిగతా వర్గాల ఓట్లను దృష్టిలోపెట్టుకొని మరో సారి నవీన్‌ యాదవ్‌ను అభ్యర్ధిగా ప్రకటించింది. దీంతో అప్పటి ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌, ఎంఐఎం మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. చివరకు టీడీపీ విజయం సాధించగా ఎంఐఎం ఓడిపోయింది. 2018 ఎన్నికల్లో ఎంఐఎం ఎన్నికలకు దూరంగా ఉంది. 2021 గ్రేటర్‌ ఎన్నికల్లో మాత్రం తమకు పట్టున్న డివిజన్‌లలో అభ్యర్థులను బరిలోకి దించింది. షేక్‌పేట, ఎర్రగడ్డలో విజయం సాధించింది.

కాగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అక్కడ పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్ధన్‌ రెడ్డి బరిలో ఉన్నారు. గులాబీ పార్టీకి పెద్ద పోటీ ఇవ్వలేకపోయారు. ఈసారి అక్కడ కాంగ్రెస్‌ నుంచి మాజీ క్రికెటర్‌ అజహరుద్దీన్‌ పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలోని షేక్‌పేట, ఎర్రగడ్డ, రహ్మత్‌నగర్‌, బోరబండ డివిజన్‌లలో మైనారిటీలు అధికంగా ఉన్నారు. దీంతో ఆయా డివిజన్‌లలో ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు వ్యూహాత్మకంగా అజహరుద్దీన్‌ను కాంగ్రెస్ నిలబెట్టింది. దీంతో ఈసారి అక్కడ బీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ తప్పదనే ప్రచారం జ‌రుగుతోంది. ఇప్పుడు అనూహ్యంగా ఎంఐఎం సైతం అభ్యర్థిని పోటీలో నిలబెట్టడంతో మైనార్టీల ఓట్లు చీలి అంతిమంగా గులాబీ పార్టీ అభ్యర్థికి మేలు జరిగేలా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎంఐఎం అసలు ఉద్దేశం కూడా ఇదేనన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే.. బీఆర్‌ఎస్‌కు ఎంఐఎం మద్దతు ఉంటుందని అందరికీ తెలిసిందే.!

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − fifteen =