మోదీ మురిపించారు..

Modi Speech Highlights,Modi Speech,Modi Highlights,Speech Highlights,Mango News,Mango News Telugu,PM Modi, Modi Speech, Hyderabad, Telangana Politics, Telangana Assembly Elections,Indian PM Narendra Modi,Narendra Modi,Highlights of PM Modi speech today,Modi Speech Latest News,Modi Speech Latest Updates,Modi Speech Live News,Narendra modi Latest News and Updates,Latest Indian Political News,Narendra modi Latest News and Updates
pm modi, modi speech, hyderabad, telangana politics, telangana assembly elections

బీజేపీ బీసీ కార్డును హైలెట్‌ చేయడానికి తెలంగాణకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంతో బాగానే మురిపించారు. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. బీసీ నేతను ముఖ్యమంత్రిగా ప్రకటించడం దేశ చరిత్రలోనే కొత్త ప్రయోగం అని ప్రకటించారు. అయితే.. ఆ బాధ్యత తెలంగాణ ప్రజలదే అంటూ ఓట్ల రాజకీయానికి తెరలేపారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో మంగళవారం సాయంత్రం బీజేపీ నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభ ఓ రకంగా పార్టీకి కాస్త ఊరటనిచ్చినట్లే. గతంలో ఎదురైన అనుభవాలను, అసంతృప్తిని పరిగణనలోకి తీసుకున్న పార్టీ తెలంగాణ నాయకత్వం ఈసారి వాటిని అధిగమించింది. సభ విజయవంతానికి కృషి చేసింది. ఎల్బీ స్టేడియం, బషీర్‌బాగ్‌ పరిసర ప్రాంతాలు జనంతో పోటెత్తాయి. ప్రత్యేక వాహనంలో మోదీ అభివాదం చేసుకుంటూ స్టేడియం అంతా కలియతిరిగి ప్రజల్లో ఉత్సాహం నింపారు. సభకు మహిళలు, యువతీ, యువకులు, విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఇక సభలో మోదీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వ్యతిరేక సర్కారు ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో బీసీలది కీలక పాత్ర అన్న మోదీ.. అలాంటి బీసీలను కేసీఆర్‌ పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న తన బీజేపీ ప్రభుత్వంలో బీసీ మంత్రులు, ఎంపీలు అధికంగా ఉన్నారని లెక్కలతో వివరించారు. బీసీ అయిన తనను ప్రధాన మంత్రిని చేసింది బీజేపీనే అని, గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత కూడా బీజేపీదేనని చెప్పుకొచ్చారు. మోదీ బీసీ జపం సభికులను ఆకర్షించిందని చెప్పాలి. అలాగే.. తొలుత సమక్క.. సారలక్క… యాదాద్రి లక్ష్మీ నరసింహలను స్మరిస్తూ ప్రధాని ప్రసంగం మొదలు పెట్టి స్థానిక సెంటిమెంట్‌ను గుర్తు చేశారు. ప్రధాని ప్రతి సారి నా కుటుంబ సభ్యులరా… అని తెలుగులో సంబోధిస్తూ కార్యకర్తలను ఆకట్టుకున్నారు. మోదీ తన ప్రసంగంలో బీసీ పదాన్ని ఎక్కువగా సంబోధిస్తూ తమ లక్ష్యాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేశారు.

దీంతో పాటు వేదికపై బీసీ సంఘం నాయకులకూ స్థానం కల్పించి బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బీసీ సంఘం నాయకుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ బీసీ సీఎం అని ప్రకటించడం సాధారణ విషయం కాదు అన్నారు. బీజేపీలో సామాజిక న్యాయం ఉంది అనడానికి ఇదే నిదర్శనం అన్నారు. తెలంగాణలో బీజేపీని గెలిపించాలని పిలుపు ఇచ్చారు. మొత్తంగా బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ ద్వారా పార్టీని కాస్త మురిపించిందనే చెప్పాలి. మరా ఓట్లను ఏమాత్రం రాల్చుతుందో చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =