కేసీఆర్ నిర్ణయం వెనుక మతలబు అదేనా..?

Is This The Reason Behind kcrs Decision,Is This The Reason Behind,Reason Behind kcrs Decision,kcrs Decision,Mango News,Mango News Telugu,kcr, brs, telangana assembly elections, polling, polling results,Telangana assembly elections Latest News,Telangana assembly elections Latest Updates,Telangana Political News And Updates,Telangana Chief Minister Kcr,Telangana Cm Kcr,Telangana Cm Kcr Live Updates
kcr, brs, telangana assembly elections, polling, polling results

తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారమని పలు ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది. మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో హంగ్ ఏర్పడుతుందని తేల్చాయి. అయితే అటు గులాబీ నేతలు మాత్రం ఏదిఏమైనప్పటికీ.. అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ తప్పని గతంలో ప్రూవ్ చేశామని.. మరోసారి ప్రూవ్ చేస్తామని అంటున్నారు. ఈసమయంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడవ్వనుండగా.. డిసెంబర్ 4న కెబినెట్ సమావేశం నిర్వహించాలని కేసీఆర్ తలపెట్టారు.

ఫలితాలు ఎలా ఉంటాయనే ఉత్కంఠ కొనసాగుతున్న వేళ .. కేసీఆర్ కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ చేయడం సంచలనంగా మారింది. అయితే కేసీఆర్ ఏం చేసినా దాని వెనుక ఓ లెక్క ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. కేబినెట్ మీటింగ్ నిర్వహించడం వెనుక కూడా ఈ లెక్క ఉన్నట్లు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ షాక్ ఇవ్వడంతో.. బీఆర్ఎస్ అధిష్టానం అన్ని నియోజకవర్గాల నుంచి ఓటింగ్ సరళిపై పూర్తి సమాచారాన్ని సేకరించిందట. ఆ సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత.. అధికారం తమదేననే అంచనాకు వచ్చారట.

ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోయినా.. అదేకారం మాత్రం తమదేననే అంచనాకు బీఆర్ఎస్ నేతలు వచ్చారట. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ కూడా వెల్లడించారు. 88 స్థానాల్లో గెలుపొందుతామని ఆశించామని.. కానీ పలు కారణాల వల్ల 70కి పైగా స్థానాల్లో కచ్చితంగా గెలుపొంది తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. అటు కేసీఆర్ పార్టీ ముఖ్య నేలతో సమావేశమై ఇదే విషయాన్ని చెప్పారట. మరోసారి అధికారంలోకి రాబోతున్నామని.. రాష్ట్రానికి సుపరిపాలన అందివ్వబోతున్నామని చెప్పారట. డిసెంబర్ 3న సంబరాలు చేసుకుందామని బీఆర్ఎస్ నేతలతో వ్యాఖ్యానించారట. ఈక్రమంలోనే 4న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =