ముగ్గురు నేతలు.. రెండు చోట్ల..

Is Double Winning Difficult For Them,Is Double Winning Difficult,Winning Difficult For Them,KCR , Huzurabad, Etala Rajender,Revanth Reddy, double winning,Telangana Assembly Elections 2023,assembly seat, BJP,BRS, Congress,Mango News,Mango News Telugu,Revanth Reddy Latest News,Revanth Reddy Latest Updates,Telangana assembly elections Latest News,Telangana assembly elections Latest Updates,Telangana Political News And Updates
KCR , Huzurabad, Etala Rajender,Revanth Reddy, double winning,Telangana Assembly Elections 2023,assembly seat, BJP,BRS, Congress,

తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఇక అభ్యర్ధుల చూపంతా కౌంటింగ్‌పైనే  పడింది. డిసెంబర్ 3 న వెలువడే  ఫలితాలతో అభ్యర్ధులంతా  తమ రాతలు ఎలా ఉండబోతున్నాయోనన్న టెన్షన్లో పడ్డారు. దీనికి తోడు ఇప్పటికే రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్ నేతలతో పాటు బీజేపీ నేతల్లో కొత్త గుబులు పుట్టిస్తున్నాయి.

మరోవైపు  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలలోని కొంతమంది అగ్రనేతలు రెండు చోట్ల పోటీ చేసిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్ అధినేత.. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా రెండు చోట్ల, బీజేపీ అభ్యర్ధిగా ఈటల రాజేందర్ రెండు చోట్ల,  కాంగ్రెస్ అభ్యర్ధిగా రేవంత్ రెడ్డి కూడా రెండు చోట్ల బరిలో దిగారు. ఇలా గతంలో కంటే భిన్నంగా రెండు నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నారు.అయితే  ఈ అగ్రనేతలంతా  రెండు చోట్ల విజయం సాధించడం సాధ్యమా కాదా  అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

2014, 2018 ఎన్నికల్లో కేవలం గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసీఆర్.. అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు.ఈ ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కూడా కేసీఆర్ పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌లో  ఈటల రాజేందర్ పోటీ చేయగా.. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నారు. అయితే ప్రస్తుత పరిణామాలను బట్టి.. గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కూడా కేసీఆర్ విజయం సాధించడం ఖాయమంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ నుంచి ఈటల రాజేందర్ కూడా రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. తనకు రాజకీయంగా పలుకుబడి ఉన్న హుజూరాబాద్‌తో పాటు సీఎం కేసీఆర్‌కు పోటీగా గజ్వేల్ నుంచి కూడా బరిలో ఉన్నారు. అయితే గజ్వేల్‌లో కేసీఆర్‌కు ఈటల ఎంత వరకు పోటీ ఇస్తారనేదే ఇప్పుడు  ఆసక్తికరంగా మారింది. గజ్వేల్‌లో కేసీఆర్‌పై  ఈటల రాజేందర్  పైచేయి సాధించడం కష్టమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అటు రేవంత్ రెడ్డి కూడా కోడంగల్‌తో పాటు కేసీఆర్‌కు పోటీగా కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం రేవంత్ రెడ్డికి కోడంగల్‌లో విజయం అటూ ఇటూ అయినా కూడా.. కామారెడ్డిలో కేసీఆర్‌తో డీకొట్టడం  అంత ఆషామాషీ విషయం కాదని అంటున్నారు. నిజానికి కామారెడ్డిలో రేవంత్ రెడ్డికి ఏ మాత్రం పట్టు లేకపోయినా అధిష్టానం ఆదేశాలతోనే కేసీఆర్‌కు పోటీగా బరిలోకి దిగారు. మొత్తంగా రెండు చోట్ల పోటీ చేస్తున్న ఈ నేతల విషయాన్ని చూసుకుంటే .. డబుల్ విన్నింగ్ సాధించడంలో ఒక్క కేసీఆర్‌కు మాత్రమే అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + nine =