లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా?

KYC Dead Line For FASTAG,KYC Dead Line,Dead Line For FASTAG,Fastag Toll Charges, One Vehicle, One FASTag,FASTags,KYC ,Toll Plaza,NHAI,National Highways Authority,Mango News,Mango News Telugu,Attention FASTag Users,FASTags with incomplete KYC,Deadline on January 31,FASTag may get deactivated,FASTag KYC Update,FASTag KYC Latest News,FASTag KYC Dead Line Live Updates,Toll Plaza Latest News
Fastag-Toll Charges, One Vehicle, One FASTag,FASTags,KYC ,Toll Plaza,NHAI,National Highways Authority

కేవైసీ ఇంకా పూర్తి చేయని ఫాస్టాగ్‌లు.. జనవరి 31, 2024 తర్వాత డీయాక్టివేట్‌ అవడం కానీ బ్లాక్‌ అవడం కానీ జరుగుతాయని ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటించింది.ఫాస్టాగ్‌ల  ద్వారా టోల్‌ వసూళ్లను మరింత క్రమబద్ధీకరించడానికి ప్రయత్నిస్తోన్న కేంద్ర ప్రభుత్వం  కీలక చర్యలకు రెడీ అయ్యింది.

ఇప్పటికీ కేవైసీ  పూర్తి చేయని ఫాస్టాగ్‌లను నిలిపివేయడానికి లేదా బ్లాక్ చేయడానికి  సిద్ధమైంది. ఇటువంటి ఫాస్టాగ్‌లను జనవరి 31, 2024 తర్వాత బ్యాంకులు డీయాక్టివేట్‌ లేదా బ్లాక్‌ చేస్తాయని నేషనల్ హైవే అథారిటీ తాజాగా ప్రకటించింది. ఒకవేళ ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్‌ ఉన్నా కూడా.. కేవైసీ కనుక పూర్తి చేయకపోతే జనవరి 31, 2024 తర్వాత వాటిని బ్యాంకులు డీయాక్టివేట్‌ చేయడం లేదా బ్లాక్‌లిస్ట్‌‌లో పెట్టడం చేస్తాయని హెచ్చరించింది. ఈ అసౌకర్యాన్ని నివారించడానికి యూజర్లు  వీలయినంత త్వరగా తమ ఫాస్టాగ్‌లకు కేవైసీ పూర్తి చేసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది.

దీనిపై ఎటువంటి అదనపు సమాచారం కావాలన్నా.. సమీపంలోని టోల్‌ప్లాజాల వద్ద కానీ  లేదా సంబంధిత బ్యాంకు కస్టమర్‌కేర్‌ నంబర్‌లను సంప్రదించి కానీ తెలుసుకోవాలని సూచించింది. ఇదేకాకుండా కొన్నిసార్లు వాహనదారులు ఫాస్టాగ్‌లను వెహికల్  ముందుభాగంలో పెట్టకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పిన నేషనల్ హైవే అథారిటీ.. దీనివల్ల టోల్‌ప్లాజాల్లో ఆలస్యం అవడంతో పాటు ప్రయాణికుల అసౌకర్యానికి కూడా కారణమవుతున్నట్లు పేర్కొంది.

అంతేకాదు వాహనదారులు ఒకే ఫాస్టాగ్‌ను ఎక్కువ వెహికల్స్‌కు ఉపయోగించడం, ఒకే వెహికల్‌కు చాలా ఫాస్టాగ్‌లను లింక్‌ చేస్తున్నట్లు కూడా  ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటి వరకూ కొన్ని చోట్ల  కేవైసీ పూర్తి కాకుండానే వారికి ఫాస్టాగ్‌లు జారీ చేస్తున్నట్లు గుర్తించిన నేషనల్ హైవే అథారిటీ.. ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా ఉండటానికి ఒకే వాహనం-ఒకే ఫాస్టాగ్‌ విధానానికి  చర్యలు చేపట్టింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =