నంది అవార్డుల పేరు మార్పు

Gaddar Awards, Nandi Awards, Name change of Nandi Awards,Presentation of Gaddar Awards on 31st January, Telangana Govt, Revanth Reddy, Andhra Pradesh, Revanth Reddy News And Live Updates, Congress, Telugu cinema, Awards, Tollywood Nandi Awards, Tollywood, Mango News Telugu, Mango News
Gaddar Awards, Nandi Awards, Name change of Nandi Awards,Presentation of Gaddar Awards on 31st January,

సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తెలంగాణలో అమలు కావనుకున్న పథకాలను అమలు పరుస్తూ ప్రతిపక్షనేతలను ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సినిమా రంగంలో రాణించిన ఉత్తమ నటులకు ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోన్న నంది అవార్డుల పేరును రేవంత్ రెడ్డి సర్కార్ మార్చింది.

ఇకపై నంది అవార్డుల స్థానంలో ‘గద్దర్’ పేరుతో అవార్డులు ప్రధానం చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ప్రతి ఏటా గద్దర్‌ జయంతి రోజు అంటే జనవరి 31న  ఈ అవార్డులను ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. ఇక నుంచి కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్‌ అవార్డులు అందిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. గద్దర్ జయంతి వేడుక సందర్భంగా  ఈ ప్రకటన చేసిన సీఎం రేవంత్.. బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో గద్దర్ జయంతి కార్యక్రమాన్ని  అధికారికంగా నిర్వహించారు.

గద్దర్ జయంతి  కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డి .. నంది అవార్డులను పునరుద్ధరించాలని కొంతమంది సినీ ప్రముఖులు తనను కోరినట్లు  తెలిపారు. దీంతోనే ఇకపై ఉత్తమ సినీ నటులకు నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ఆయన ప్రకటించారు. గద్దర్ అవార్డులకు సంబంధించిన జీవోను..తాము త్వరలోనే విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

మరోవైపు తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాటతో ఉద్యమాన్ని ఉవ్వెత్తును ఎగసేలా చేసిన గద్దర్ విగ్రహాన్ని తెల్లాపూర్‌లో ఏర్పాటు చేయడానికి ఇప్పటికే   రేవంత్  సర్కార్ అనుమతి ఇచ్చింది. తాజాగా గద్దర్ పేరుతో అవార్డులు ప్రధానం చేస్తామని ప్రకటించిన  ప్రభుత్వం తాజా ప్రకటనతో ఆయనను మరోసారి గౌరవించిందని గద్దర్ అభిమానులు అంటున్నారు. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ కూతురు వెన్నెలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎప్పటికప్పుడు ప్రజా గాయకుడిపై తమ గౌరవాన్ని చాటుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + nineteen =