మేడారం మినీ జాతరకు ముహూర్తం ఖరారు, నాలుగు రోజుల పాటు నిర్వహణ

Medaram Mini Jatara will be Held From 2023 February 1st to 4th,Medaram Mini Jatara,Mini Jatara Held From February,Mini Jatara Medaram,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister KTR

ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో శ్రీ సమ్మక్క–సారలమ్మల మినీ జాతరకు ముహూర్తం ఖరారైంది. ఈ మేడారం మినీ జాతర ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది. అమ్మవార్ల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు అధ్యక్షతన సంబంధిత పూజారులు ఇటీవలే సమావేశమై మినీ జాతర నిర్వహణ తేదీలపై నిర్ణయం తీసుకున్నారు. మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మినీ జాతరను వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. తొలిరోజైన ఫిబ్రవరి 1న మండమెలిగే పండుగ, 2వ తేదీన సారలమ్మ అమ్మవారి గ‌ద్దె, 3వ తేదీన సమ్మక్క గద్దె శుద్ధి కార్యక్రమాలు ఉంటాయని, అనంతరం సమ్మక్క, సారలమ్మల గద్దెలను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకోవచ్చని తెలిపారు.

వనదేవతలైన సమ్మక్క-సారలమ్మల మినీ జాతరకు తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం నిధులు కేటాయించి, భక్తులకు సౌకర్యాలు, ఏర్పాట్లు చేయాలని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం మహా జాతరను ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఫిబ్రవరిలో జరిగే మేడారం మినీ జాతరలో వన దేవతలను గద్దెలపైకి తీసుకురావడం మినహా ఇతర సంబంధిత పూజా కార్యక్రమాలను యథావిధిగా నిర్వహిస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =