సివిల్స్, గ్రూప్-1లో ఎస్సీ యువత అద్భుత విజయాలు సాధించేలా దృష్టి సారించాలి: మంత్రి కొప్పుల

Minister Koppula Eshwar Held Review on SC Welfare and SC Study Circles, Telangana Minister Koppula Eshwar Held Review on SC Welfare and SC Study Circles, Koppula Eshwar Held Review on SC Welfare and SC Study Circles, Review on SC Welfare and SC Study Circles, Review on SC Study Circles, Review on SC Welfare, SC Study Circles, SC Welfare, Telangana Minister Koppula Eshwar, Minister Koppula Eshwar, Koppula Eshwar, Welfare Minister Koppula Eshwar, Telangana Welfare Minister, SC Study Circles News, SC Study Circles Latest News, SC Study Circles Latest Updates, SC Study Circles Live Updates, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమ శాఖ, స్టడీ సర్కిల్ పనితీరుపై మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం సమీక్ష నిర్వహించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితారాణా, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వేణుగోపాల్ రావులు పాల్గొన్నారు. సివిల్స్, గ్రూప్-1 పోటీ పరీక్షల్లో ఎస్సీ యువత అద్భుత విజయాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని, దృష్టి సారించాల్సిందిగా ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ యువత తమ రిజర్వేషన్ కోటాకు సంబంధించినవే కాక ఓపెన్ లో కూడా ఉన్నత ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దాలంటూ అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ, సివిల్స్, గ్రూప్-1 పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు వచ్చే విధంగా ఆయా అంశాలలో నిపుణులైన వారి చేత ప్రత్యేక శిక్షణ ఇప్పించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ ను త్వరితగతిన మంజూరు చేయాలని, సంక్షేమ హాస్టళ్లలో వసతులను మరింత మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. హాస్టళ్లలో విద్యార్థుల సౌకర్యార్థం డిజిటల్ క్లాస్ రూంలు, సౌరశక్తితో నడిచే వాటర్ హీటర్స్ ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు “సహజ “పేరుతో తయారు చేస్తున్న ఉత్పత్తుల గురించి మంత్రి వివరించారు. చౌకగా లభించే నాణ్యమైన ఈ ఉత్పత్తులను గురుకులాలు, హాస్టళ్లకు అందిస్తే బాగుంటుందని, ఈ అంశాన్ని పరిశీలించవలసిందిగా కమిషనర్ యోగితారాణకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − three =