అమరావతిలో శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆలయంలో వైభవంగా మహా సంప్రోక్షణ, పాల్గొన్న ఏపీ గవర్నర్

Maha Samprokshana Program at Amaravati Srivari Temple AP Governor TTD Chairman Attends, Maha Samprokshana Program at Amaravati Srivari Temple, AP Governor Attends Maha Samprokshana Program at Amaravati Srivari Temple, TTD Chairman Attends Maha Samprokshana Program at Amaravati Srivari Temple, Maha Samprokshana Program, Amaravati Srivari Temple, TTD chairman YV Subba Reddy, YV Subba Reddy, AP Governor Biswabhusan Harichandan, Governor Biswabhusan Harichandan, Biswabhusan Harichandan, AP Governor Biswabhusan, AP Governor, Maha Samprokshana Program News, Maha Samprokshana Program Latest News, Maha Samprokshana Program Latest Updates, Maha Samprokshana Program Live Updates, Mango News, Mango News Telugu,

అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆలయంలో గురువారం ప్రాణ ప్ర‌తిష్ట‌, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానంద్రేద్ర స్వామి, శ్రీ స్వాత్వానంద్రేద్ర స్వామి, ఏపీ ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలం వెంకటపాలెంలో రూ.40 కోట్ల వ్యయంతో, 25 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో అనేక రాష్ట్రాలలో నిర్మించిన శ్రీవారి ఆల‌యాల కంటే అమరావతిలోని ఆల‌యం అతి పెద్దది. ఈ శ్రీవారి ఆలయంలో జూన్ 4వ తేదీ సాయంత్రం శోభాయాత్ర‌, పుణ్యాహ‌వ‌చ‌నం, ఆచార్య ఋత్విక్ వ‌ర‌ణం, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ నిర్వ‌హించగా, జూన్ 5 నుండి మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా గురువారం ఉద‌యం 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు మిథున ల‌గ్నంలో ప్రాణ ప్ర‌తిష్ట‌, మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వహించారు.

మహాసంప్రోక్షణ అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, శ్రీ స్వరూపానంద్రేద్ర స్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు మొదటగా స్వామివారిని ద‌ర్శ‌నం చేసుకున్నారు. సాయంత్రం ఆలయంలో శాంతి క‌ల్యాణోత్స‌వం జ‌రుగ‌నుంది. అనంత‌రం ధ్వ‌జావ‌రోహ‌ణం చేప‌ట్టనున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం సాయంత్రం నుండి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + eight =