భద్రాచలంలో గోదావరి ఉధృతి శాంతించాలని కోరుతూ మంత్రి పువ్వాడ అజయ్ ప్రత్యేక పూజలు

Minister Puvvada Ajay Offers Special Pooja to Control Godavari Flood Situation in Bhadrachalam, Telangana Minister Puvvada Ajay Offers Special Pooja to Control Godavari Flood Situation in Bhadrachalam, Puvvada Ajay Offers Special Pooja to Control Godavari Flood Situation in Bhadrachalam, Special Pooja to Control Godavari Flood Situation in Bhadrachalam, Godavari Flood Situation in Bhadrachalam, Puvvada Ajay Offers Special Pooja, Minister of Transport of Telangana Puvvada Ajay Kumar, Telangana Transport Minister Puvvada Ajay Kumar, Transport Minister Puvvada Ajay Kumar, Telangana Transport Minister, Puvvada Ajay Kumar, Special Pooja, Special Pooja to Control Godavari Flood Situation in Bhadrachalam, Godavari Flood Situation in Bhadrachalam News, Godavari Flood Situation in Bhadrachalam Latest News, Godavari Flood Situation in Bhadrachalam Latest Updates, Godavari Flood Situation in Bhadrachalam Live Updates, Mango News, Mango News Telugu,

భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తడంతో భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. గోదావరి ఉధృతి వలన పలు గ్రామాలు వరద ప్రభావంలో చిక్కుకున్నాయి. కాగా ఖమ్మం జిల్లా స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భధ్రాచలంలోనే ఉంటూ, క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం గోదావరి నది వద్ద వరద ఉధృతిని మంత్రి పువ్వాడ అజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరి ఉదృతి శాంతించాలని కోరుతూ భద్రాచలం కరకట్ట వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వేదపండితులు, అర్చకులు, ఆలయ అధికారులతో కలిసి నది హారతి ఇచ్చారు.

మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం కొద్దికొద్దిగా తగ్గుతుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు భద్రాచలంలో గోదావరి నీటి మట్టం అత్యధికంగా 71.30 అడుగులకు చేరుకోగా, అక్కడి నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. జూలై 16, శనివారం మధ్యాహ్నం 12:00 గంటలకు భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 70.30 అడుగుల వద్ద ఉంది. ఇక క్రిందికి నీటి విడుదల 23,92,527 క్యూస్సెకులగా ఉందని, 53.00 అడుగుల వద్ద నుంచి ప్రారంభమయ్యే మూడో ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం అమలులో ఉందని చెప్పారు. వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఎగువ ప్రాజెక్టుల గేట్లను మూసివేస్తుండడంతో, భద్రాచలం వద్ద కూడా వరద ఉధృతి కొంత నెమ్మదించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =