డ్రైవర్ కమ్ ఓనర్ స్కీం కింద లబ్ధిదారులకు కార్లు పంపిణీ

106 cars distributed by Minority Finance, Cars distributed under Driver cum Owner scheme in Hyderabad, Cars to Beneficiaries under Driver Cum Owner Scheme, Driver Cum Owner Scheme, Driver Cum Owner Scheme 2021, Driver Cum Owner Scheme Telangana, driver empowerment programme, Home Minister Mahmood Ali, Hyderabad, Koppula Eshwar, Mahmood Ali, Mahmood Ali Distributed Cars to Beneficiaries under Driver Cum Owner Scheme, Ministers Koppula Eshwar, Self-employment scheme for minorities

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గొప్ప లౌకిక వాది అని, ఆయన సుపరిపాలనలో మత సామరస్యం వెల్లివిరుస్తోందని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీలు అన్నారు. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్ కమ్ ఓనర్ స్కీం కింద 106 మందికి మారుతి కార్లు అందజేశారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీలు పచ్చజెండా ఊపి లబ్ధిదారులకు అందించిన కార్లను ప్రారంభించారు.

నాంపల్లి హజ్ భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మైనారిటీల భద్రత, సంక్షేమం, సముద్ధరణకు సీఎం కేసీఆర్ అంకితభావంతో ముందుకు సాగుతున్నారన్నారు. మైనారిటీల ఉన్నతికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నాprogress under driverమని చెప్పారు. ఈ డ్రైవర్ కమ్ ఓనర్ పథకం వినూత్నమైనదని, ఇటువంటిది తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా కూడా అమలు కావడం లేదన్నారు. ఈ విధంగా నిరుద్యోగ యువత ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, వారి కుటుంబ జీవన పరిస్థితులు మెరుగయ్యేందుకు ఈ పథకం దోహదపడుతుందన్నారు. మైనారిటీలను ఉన్నత విద్యావంతుల్ని చేసేందుకు 204 గురుకులాలను ఏర్పాటు చేశామని మంత్రి కొప్పుల వివరించారు.

ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, 10వేల మంది ఇమామ్, మౌజమ్ లకు ప్రతి నెల 5వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నామన్నారు. మైనారిటీలందరూ సీఎం కేసీఆర్ కు సంపూర్ణ మద్దతునిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, ప్రభుత్వ కార్యదర్శి అహ్మద్ నదీమ్, ఎమ్మెల్సీ హసన్ ఎఫెండి, ఎమ్మెల్యే హుస్సేన్ మీరజ్, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ మహ్మద్ సలీం, ఉన్నతాధికారులు షానవాజ్ ఖాసీం, కాంతివెస్లీ, యూనస్, స్థానిక కార్పోరేటర్ సురేఖ, హజ్ భవన్ మసీదు ఇమామ్ సాబేర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + fourteen =