హైదరాబాద్‌ లో నెలరోజుల్లో వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ ల్యాబ్ ఏర్పాటు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Centre Aids In Setting Up New Vaccine Testing Lab, Centre sanctions funds from PMCares, Hyderabad gets Vaccine Testing Laboratory, Kishan Reddy, Mango News, Third Vaccine Testing Lab to be set up in Hyderabad, Union govt to set up Vaccine Testing Laboratory in Hyderabad, Union Minister, Union Minister Kishan Reddy, Union Minister Kishan Reddy Says Vaccine Testing Laboratory to Set up in Hyderabad in a Month, Vaccine test lab to come up at Hyderabad, Vaccine Testing Laboratory, Vaccine Testing Laboratory in Hyderabad, Vaccine Testing Laboratory to Set up in Hyderabad in a Month

హైదరాబాద్‌ నగరంలో వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు శనివారం నాడు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. నెలరోజుల్లో బయోటెక్నాలజీ డిపార్ట్ మెంట్ కింద హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబ్ (వీటీఎల్) ఏర్పాటు కాబోతుందని చెప్పారు. పీఎం కేర్స్‌ నిధులతో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటుతో హైదరాబాద్ లో ఫార్మా రంగం యొక్క సమగ్ర అభివృద్ధికి మరో పెద్ద అడుగు పడిందని, అలాగే ఈ ల్యాబ్ కోవిడ్ వ్యాక్సిన్ల ఉత్పత్తి వేగాన్నిపెంచడానికి ఉపయోగపడుతుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

పీఎం కేర్స్‌ నిధులతో హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌ తో పాటు పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ లో కూడా కొత్తగా వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి కేంద్రం అనుమతిచ్చింది. దీంతో దేశంలో వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబ్ ల సంఖ్య నాలుగుకు చేరనుంది. మరోవైపు హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పలుమార్లు కేంద్రప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 8 =