‘మా’ అధ్యక్ష ఎన్నికలు: 27 మందితో ప్యానెల్ ప్రకటించిన నటుడు ప్రకాశ్‌ రాజ్‌

Actor Prakash Raj, Actor Prakash Raj Announced his Panel, Hema In The MAA Election Battle, Jeevitha, MAA Elections, MAA Elections 2021, Manchu Vishnu to Contest for MAA President, Mango News, Movie Artists Association, Movie Artists Association election results, Movie Artists Association Elections, Prakash Raj Announced his Panel, Prakash Raj to contest for MAA Association Election 2021, Prakash Raj to contest for MAA Elections, Tollywood’s MAA elections

తెలుగు సినీపరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నికల సందడి మొదలైంది. ఈసారి మా అధ్యక్ష పదవికోసం మరింతమంది ప్రముఖ నటులు బరిలోకి దిగనుండడంతో రోజురోజుకి ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌, హీరో మంచు విష్ణు, నటి జీవిత రాజశేఖర్, నటి హేమ మా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగనుండడంతో చతుర్ముఖ పోటీ నెలకుంది. ఈ నేపథ్యంలో ముందుగా నటుడు ప్రకాశ్ రాజ్ 27 మందితో కూడిన ప్యానెల్ ను ప్రకటించారు.

“త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎల‌క్ష‌న్స్‌ని పుర‌స్క‌రించుకుని, ‘మా’ శ్రేయ‌స్సు దృష్ట్యా నిర్మాణాత్మ‌క ఆలోచ‌న‌ల‌ని ఆచ‌ర‌ణ‌లో పెట్టే దిశ‌గా మా ప్ర‌తిష్ట‌కోసం, మ‌న న‌టీ నటుల బాగోగుల కోసం, సినిమా న‌టీన‌టులంద‌రి ఆశీస్సుల‌తో, అండ‌దండ‌ల‌తో ఎన్నిక‌ల‌లో నిల‌బ‌డటం కోసం, ప‌ద‌వులు కాదు ప‌నులు మాత్ర‌మే చేయ‌డం కోసం, ‘మా’ టీంతో రాబోతున్న విష‌యాన్ని తెలియ‌ప‌రుస్తున్నాం” అని ప్రకాశ్ రాజ్ ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రకాశ్ రాజ్ ప్యాన‌ల్‌ :

  1. ప్రకాశ్ రాజ్
  2. జయసుధ
  3. శ్రీకాంత్
  4. బెనర్జీ
  5. సాయికుమార్
  6. తనీశ్
  7. ప్రగతి
  8. అనసూయ
  9. సన
  10. అనితా చౌదరి
  11. సుధ
  12. అజయ్
  13. నాగినీడు
  14. బ్రహ్మాజీ
  15. రవి ప్రకాశ్
  16. సమీర్
  17. ఉత్తేజ్
  18. బండ్ల గణేశ్
  19. ఏడిద శ్రీరామ్
  20. శివారెడ్డి
  21. భూపాల్
  22. టార్జాన్
  23. సురేశ్ కొండేటి
  24. ఖయ్యూం
  25. సుడిగాలి సుధీర్
  26. గోవిందరావు
  27. శ్రీధర్ రావు
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + three =