మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీపై టీఆర్ఎస్ ఛార్జీషీట్, మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Munugode By-poll Minister KTR Announces TRS Charge Sheet on BJP Over Its Politics in Telangana, TRS Charge Sheet on BJP, Minister KTR Announces TRS Charge Sheet, TRS Party Victory, Mango News,MAngo News Telugu,TRS Party, Munugode By-Poll, TRS Party Munugode By-Poll, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates

మునుగోడు ఉప ఎన్నికకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ బీజేపీపై విమర్శల దాడి పెంచింది. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆ బీజేపీపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శనివారం సమావేశం నిర్వహించిన ఆయన బీజేపీపై ఛార్జీషీట్‌ను వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా తెలంగాణ ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. మనదేశంలో ఇప్పటివరకు 14మంది ప్రధానులుగా చేశారని, వారిలో ఏ ఒక్కరూ చేయని విధంగా ప్రధాని మోదీ తొలిసారిగా చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధించారని మంత్రి తెలిపారు. మునుగోడు ప్రజల తరపున ఈ రోజు బీజేపీపై ఛార్జీషీట్ వేస్తున్నామని అన్నారు. ఇక ఈ ఎనిమిది సంవత్సరాల పాలనలో ప్రజలకు బీజేపీ ఏం చేసిందో చెప్పకుండా, సీఎం కేసీఆర్ పైన ఆరోపణలు చేస్తోందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బీజేపికి ఓటు – మునుగోడుకు చేటు అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

బీజేపీపై టీఆర్ఎస్ ప్రకటించిన ఛార్జీషీట్‌లోని కీలక అంశాలు మంత్రి కేటీఆర్ మాటల్లో..

మునుగోడు ఫ్లోరైడ్ గోడు వినలేదు

  • నాటి ప్రధాని వాజ్‌పేయి టేబుల్‌ మీద ఫ్లోరైడ్ బాధితుడిని పడుకోబెట్టి, గోడు వెళ్లబోసుకున్నా బీజేపీ ప్రభుత్వం చర్యలు శూన్యం.
  • ఫ్లోరైడ్ మహమ్మారిని మట్టుబెట్టి.. మంచినీళ్లు ఇచ్చేందుకు చేపట్టిన మహత్తర పథకం మిషన్ భగీరథకు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫారసు చేస్తే నీతిలేని మోదీ సర్కారు 19 పైసలు కూడా ఇవ్వలేదు.
  • కానీ రాజగోపాల్‌ రెడ్డికి మాత్రం రూ. 18 వేల కోట్ల పెద్ద కాంట్రాక్ట్‌ ను కట్టబెట్టారు బీజేపీ పెద్దలు.
  • ఎన్నో పోరాటాల ఫలితంగా మంజూరయ్యి, చౌటుప్పల్‌లో ఏర్పాటు కావలసిన ఫ్లోరైడ్‌ అండ్ ఫ్లోరోసిస్ మిటిగేషన్ సెంటర్‌ ను వేరే రాష్ట్రానికి తరలించింది.
  • మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని 2016లో నాటి కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు.

మగ్గానికి మరణ శాసనం-చేనేతకు ఉరి

  • చరఖా తిప్పి, నూలు వడికి చేనేతను స్వదేశీ ఉద్యమానికి ప్రతీకగా నిలబెట్టిండు గాంధీ మహాత్ముడు. ఇప్పుడు మోదీ వచ్చి చరిత్రలో తొలిసారి చేనేతపైన పన్నువేసి మగ్గానికి మరణశాసనం రాస్తున్నడు.
  • 5 శాతం జీఎస్టీ విధించమే కాదు. దానిని 12 శాతానికి పెంచాలని దుర్మార్గమైన ఆలోచన చేసి.. బట్టలు నేసే వాళ్ళ పొట్ట కొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నది మోదీ ప్రభుత్వం.
  • స్వాతంత్ర స్వర్ణోత్సవాల కోసం జాతీయ జెండాల తయారీని దేశ నేతన్నలకు అప్పగించకుండా, చైనా నుంచి దిగుమతి చేసుకునే దౌర్భాగ్యం పట్టించింది ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం.

ఉన్న స్కీమ్‌లన్నీ ఊడగొట్టి, చేనేత కళాకారుడి చేతిని నరికేసేస్తున్నది మోడీ సర్కారు

  • ఆలిండియా హాండ్లూమ్‌ బోర్డు రద్దు
  • ఆలిండియా హాండీక్రాఫ్ట్ బోర్డు రద్దు
  • మహాత్మ గాంధీ బున్‌కర్ బీమా యోజన రద్దు
  • లాంబార్డ్ బీమా రద్దు
  • హౌజ్‌ కం షెడ్ స్కీం రద్దు
  • థ్రిఫ్ట్ ఫండ్ రద్దు
  • యార్న్‌పైన సబ్సిడీ 40 నుంచి 15 శాతానికి తగ్గింపు

నేతన్నకు చేయూతనిచ్చేందుకు ఎన్ని ప్రతిపాదనలు కేంద్రం నుంచి స్పందన లేదు

  • తెలంగాణలో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీ స్థాపించాలని వినతి.
  • హాండ్లూమ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని వినతి.
  • నేషనల్‌ టెక్స్‌టైల్ రీసెర్చ్‌ సెంటర్ మంజూరు చేయాలని వినతి.
  • కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు నయాపైసా ఇవ్వలేదు.
  • నారాయణపేటలో హాండ్లూమ్ పార్క్‌ పెడతామని అమిత్‌ షా ఇచ్చిన హామీ అటకెక్కింది.

మోటర్లకు మీటర్లు-ఉచిత విద్యుత్‌కు ఉరి

  • బోరుబావుల కింద కరెంట్‌తో వ్యవసాయం చేసుకుంటున్న 30 లక్షల మంది రైతులను బాయిలకాడ మోటర్లకు మీటర్లు పెట్టాల్సిందే, నెలనెలా రైతు కరెంట్ బిల్లు కట్టాల్సిందేనని రాష్ట్రాల మెడమీద కత్తిపెట్టి బెదిరిస్తున్నది మోదీ సర్కారు.
  • రైతులపై పగబట్టిన బీజేపీ ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెడితేనే ఏడాదికి రూ. 6 వేల కోట్ల రుణం ఇస్తమని షరతులు పెట్టి రాష్ట్రాన్ని బ్లాక్ మెయిల్ చేసింది. రైతుల ప్రయోజనం కల్పించడం కోసం సుమారు రూ. 30 వేల కోట్ల రుణాన్ని వదులుకుంది కేసీఆర్ ప్రభుత్వం.

కృష్ణా జలాలపై నికృష్ట రాజకీయం

  • కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా నికృష్ట రాజకీయం చేస్తున్నది కేంద్రం లోని బీజేపీ.
  • 575 టీఎంసీల న్యాయమైన వాటా దక్కకుండా చేస్తూ, ఉమ్మడి నల్లగొండ పాలమూరు, రంగారెడ్డి జిల్లాల రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్నది మోదీ ప్రభుత్వం.
  • కేంద్రం నాన్చుడి ధోరణితో డిండి, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు అడ్డు తగులుతున్నది.

వంటగదిలో మంటపెట్టిన మోదీ

  • వంట గదిలో సిలిండర్ మంటలు పెట్టి, ఆడబిడ్డల కంట కన్నీళ్లు తెప్పిస్తున్నది కేంద్రం.
  • 2014లో 410 రూపాయలు వున్న గ్యాస్‌ సిలిండర్ ధర ఇప్పుడు 1100 రూపాయలు దాటింది.
  • మోదీ అధికారంలోకి వచ్చాక నెమ్మదిగా సిలిండర్ పై సబ్సిడీ, 2014 లో ఉన్న నగదు బదిలీ రాయితీని ఎత్తేశారు.

జనంపై పెట్రో బాంబు.. ధరల దాడి

  • అడ్డగోలుగా ఎక్సైజ్‌ సెస్సు లు వడ్డించి, పెట్రోల్ డిజీల్ ధరలను సెంచరీ దాటించిన ఘనడు మోదీ. ముడి చమురు ధర పెరగకున్నా, అదనపు సెస్సులు మోత మోగించి చమురు రేట్లను పెంచి, జనం చేతి చమురు వదిలించింది బీజేపీ ప్రభుత్వం.
  • కరోనా కాలంలో కూడా కనికరం చూపకుండా సెస్సులు ద్వారా ఎనిమిదేండ్లలో 30 లక్షల కోట్ల రూపాయలను దండుకున్నారు.
  • నిత్యావసర వస్తువులు ఉప్పులు, పప్పులు, నూనెలు, కూరగాయల ధరల పెరుగుదలతో ఏం కొనేటట్టు లేక, ఏం తినేటట్టు లేక పేదల బతుకు బండి తిరగబడింది.

గిరిజన రిజర్వేషన్లకు మోకాలడ్డు

  • పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలని రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానానికి ఆమోదం చెప్పకుండా 5 ఏండ్లు తొక్కిపెట్టి గిరిజన ద్రోహానికి పాల్పడింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.
  • పార్లమెంట్ లో ప్రశ్న అడిగితే ఆ ప్రతిపాదనే రాలేదని పచ్చి అబద్ధం చెప్పి తెలంగాణ గిరిజన బిడ్డల హక్కులను చులకనగా చూసి అవమానించిన దుష్ట పార్టీ బీజేపీ.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =