జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా నిలిచిన 9 తెలంగాణ గ్రామాలు

National Panchayat Awards 2021: Telangana State Got Total 12 Awards in 3 Categories

ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారాలలో మరోసారి తెలంగాణకు అవార్డుల పంట పండింది. మూడు కేటగిరీలలో మొత్తం 12 అవార్డులు వచ్చాయి. దేశంలోనే అత్యుత్తమ 1 జిల్లా, 2 మండల పరిషత్, 9 గ్రామ పంచాయతీలకు మొత్తం 12 అవార్డులు వచ్చాయి. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆర్థిక సలహాదారు డాక్టర్ బిజయ్ కుమార్ బెహరా ఈ అవార్డులను ప్రకటించారు. దీంతో ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డుల్లో మరోసారి తెలంగాణ రాష్ట్రం తమ సత్తా చాటింది. ఈ అవార్డులు రావడం పట్ల తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డులు రావడానికి కారణమైన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శి సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ కృషి, దార్శనికత వల్లే ఇదంతా సాధ్యపడిందని అన్నారు. ఇంత మంచి శాఖను తనకు అప్పగించడం, అనేక అవార్డులు రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి చెప్పారు.

అంతేగాక తెలంగాణ ఏర్పడ్డాక, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకువచ్చారన్నారు. మూడు విడతలుగా నిర్వహించిన ఈ పల్లె ప్రగతితో తెలంగాణలోని ప్రతి గ్రామానికి ట్రాక్టర్ల, ట్రాలీ, ట్యాంకర్లు వచ్చాయన్నారు. అలాగే నర్సరీలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, స్మశాన వాటికలు ఏర్పడ్డాయన్నారు. ప్రతి నిత్యం పారిశుద్ధ్యం కొనసాగుతున్నదని చెప్పారు. గ్రామ పంచాయతీల్లో వర్క్స్, స్ట్రీట్ లైట్స్, గ్రీన్ కవర్ వంటి నాలుగు కమిటీల ద్వారా అద్భుతంగా పల్లెలు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు 8500 వేతనాన్ని పెంచామని, ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు కేంద్ర నిధులతో సమానంగా 308 కోట్లు సీఎం విడుదల చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ కారణంగా అతి చిన్న గ్రామ పంచాయతీలకు కూడా కనీసం 5 లక్షలకు తగ్గకుండా నిధులు వస్తున్నాయని తద్వారా అభివృద్ధి సాధ్యమవుతున్నదన్నారు. తాజాగా గ్రామ పంచాయతీల అవసరాలకు తగ్గట్లుగా ఆయా పంచాయతీల తీర్మానాల మేరకే ఎవరి అనుమతులు లేకుండానే పనులు చేపట్టవచ్చన్న స్వేచ్ఛనిచ్చామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానిక సంస్థల అభివృద్ధికి జిల్లా, మండల పరిషత్ లకు 500 కోట్లు కేటాయించిన ఘనత కూడా తెలంగాణకు, సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

వెరసి ఒకప్పుడు తెలంగాణలో వరంగల్ జిల్లాలోని ఒక గంగదేవి పల్లెనే అంతా చూసే వారని, ఇప్పుడు అలాంటి గంగదేవి పల్లెలు తెలంగాణ రాష్ట్రమంతా ఏర్పడుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. వాటికి నిదర్శనమే ఈ అవార్డులని మంత్రి తెలిపారు. నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల అభివృద్ధి అనే ట్యాగ్ లైన్ తీసుకుని కేంద్రం ఉత్తమ జిల్లా, మండల, గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇచ్చారని మంత్రి తెలిపారు.

దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారాల్లో తెలంగాణకు లభించినవి:

  1. జనరల్ కేటగిరిలో ఉత్తమ జిల్లా పరిషత్ – మెదక్ (సంగారెడ్డి)
  2. జనరల్ కేటగిరిలో ఉత్తమ మండల పరిషత్ – జగిత్యాల జిల్లా కోరుట్ల, పెద్దపల్లి జిల్లా ధర్మారం
  3. జనరల్ కేటగిరిలో ఉత్తమ మండల పరిషత్ – పెద్దపల్లి జిల్లా ధర్మారం

ఉత్తమ గ్రామ పంచాయతీలు:

3. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పార్లపల్లి
4. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్
5. సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లె
6. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల్
7. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి
8. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం చక్రాపూర్
9. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ళ
10. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట
11. పెద్దపల్లి రామగిరి మండలం సుందిళ్ళ

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 17 =