ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) పరిధిలోని డిగ్రీ, పీజీ కోర్సుల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సులకు సంబంధించి మొదటి, మూడో, అయిదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను ఓయూ అధికారిక వెబ్సైట్ www.osmania.ac.in లో ఉంచినట్లు చెప్పారు.
మరోవైపు కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఈసారి డిగ్రీ కోర్సుల్లో మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు డిటెన్షన్ సిస్టమ్ వర్తించదని ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించింది. డిటెన్షన్ లేనప్పటికీ ఆ తర్వాత సంవత్సరంలో విద్యార్థులు బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షలు నిర్వహించినప్పటికీ ఈ సంవత్సరం విద్యార్థులను డిటైన్ చేయమని ప్రకటించారు. నిబంధనల ప్రకారం విద్యార్థులు పై తరగతికి ప్రమోట్ కావాలంటే 50 శాతం క్రెడిట్స్ పొందాలి. ఈ సంవత్సరానికి ఈ నియమం వర్తించదని పేర్కొన్నారు. ఇక డిగ్రీ ఫైనల్ సంవత్సరం విద్యార్థులు పట్టా పొందాలంటే తప్పనిసరిగా అన్ని పరీక్షలు పాస్ కావాల్సి ఉంటుందని తెలిపారు.
🌐 Osmania University 🏛️@OsmaniaOfficial
Revaluation Results
UG (CBCS) (RV) https://t.co/jBP16KQeT3, https://t.co/b2rVJpLoEG, BBA, BA
I,III,V Semesters
Nov/Dec 2019https://t.co/cs8y2u9VKY#OsmaniaUniversity #OsmaniaOfficial #OUResults #Osmania #University
— Osmania University 🏛 🇮🇳 #StayHome #StaySafe (@OsmaniaOfficial) April 24, 2020
🌐 Osmania University 🏛️@OsmaniaOfficial#Telangana : I, II year degree students will not be detained this year.@DrTamilisaiGuv @TelanganaGuv @PIBHyderabad @airnews_hyd #OsmaniaUniversity #Hyderabad #India pic.twitter.com/dX8OhDQUEf
— Osmania University 🏛 🇮🇳 #StayHome #StaySafe (@OsmaniaOfficial) April 24, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu