తెలంగాణలో సుపరిపాలనకై బీజేపీ కృషి చేస్తుంది, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ప్రధాని మోదీ సమావేశం

Prime Minister Narendra Modi Met GHMC BJP Corporators and Other Party Leaders from Telangana at Delhi, PM Modi Met GHMC BJP Corporators and Other Party Leaders from Telangana at Delhi, Prime Minister Narendra Modi to held Meeting with GHMC BJP Corporators and other State Leaders Today at Delhi, PM Modi to held Meeting with GHMC BJP Corporators and other State Leaders Today at Delhi, Modi to held Meeting with GHMC BJP Corporators and other State Leaders Today at Delhi, PM Modi to held Meeting with State Leaders Today at Delhi, PM Modi to held Meeting with GHMC BJP Corporators Today at Delhi, GHMC BJP Corporators, State Leaders, Delhi, PM Modi to meet Hyderabad BJP corporators, Modi to meet Hyderabad BJP corporators, Hyderabad BJP corporators, PM Modi to meet GHMC BJP Corporators, PM Modi to meet State Leaders Today at Delhi, Greater Hyderabad Municipal Corporation, Hyderabad BJP corporators, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు సమావేశం అయ్యారు. 47 మంది బీజేపీ కార్పొరేటర్లతో పాటుగా పలువురు రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఢిల్లీలో దాదాపు గంటకుపైగా జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మోదీ ప్రతి కార్పొరేటర్ తో మాట్లాడి వారి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడం, పార్టీని బలోపేతం చేయడంపై వారికీ ప్రధాని మోదీ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది.

అనంతరం ఈ సమావేశంపై ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “జీహెచ్‌ఎంసీ బీజేపీ కార్పొరేటర్లను, తెలంగాణకు చెందిన ఇతర పార్టీ నేతలను కలిశాను. కమ్యూనిటీ సేవా ప్రయత్నాలపై దృష్టి పెట్టడం మరియు అట్టడుగు స్థాయి ప్రజలకు ఎలా సహాయపడాలనే దానిపై మేము విస్తృత చర్చలు చేసాము. తెలంగాణలో సుపరిపాలన కోసం మరియు వంశపారంపర్య దుష్టపాలనకు ముగింపు పలికేందుకు బీజేపీ కృషి చేస్తుంది” అని పేర్కొన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్, మురళీధర్‌రావు సహా పలువురు కీలక బీజేపీ నేతలు ప్రధానితో సమావేశానికి హాజరు అయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 16 =