టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్‌

Senior IPS Officer VC Sajjanar Takes Charge As TSRTC MD, Mango News, Telangana Breaking News, Telangana News Today, Senior IPS Officer VC Sajjanar, VC Sajjanar, TSRTC MD, TSRTC MD VC Sajjanar, former Cyberabad Commissioner VC Sajjanar, Telangana appoints VC Sajjanar as TSRTC MD, IPS officer Stephen Ravindra, Chief minister K Chandrashekar Rao

సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్‌ ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ గా తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే నియమించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం టీఎస్ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌ లోని టీఎస్ఆర్టీసీ బస్‌ భవన్‌ లో పండితుల ఆశీర్వచనాలు మధ్య సజ్జనార్‌ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది సజ్జనార్‌ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ రోజు ఆర్టీసి ఉన్నతాధికారులతో ఎండీ సజ్జనార్ సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇంతకుముందు వీసీ సజ్జనార్ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పనిచేసిన విషయం తెలిసిందే. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల కట్టడికి తీసుకున్న చర్యలతో సజ్జనార్ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 8 =