హైదరాబాద్ నగరంలో వైభవంగా జరుగుతున్న శ్రీ హనుమాన్ శోభాయాత్ర

Sri Hanuman Vijaya Yatra-2022 at Hyderabad City Devotees Participated in Large Number, Sri Hanuman Vijaya Yatra-2022 at Hyderabad City, Devotees Participated in Large Number For Sri Hanuman Vijaya Yatra-2022, Sri Hanuman Vijaya Yatra-2022, 2022 Sri Hanuman Vijaya Yatra, Sri Hanuman Vijaya Yatra, Sri Hanuman Vijaya Yatra at Hyderabad City, Hyderabad City Sri Hanuman Vijaya Yatra, Hanuman Jayanti Shobha Yatra, Rama Navami Shobha yatra, Rama Navami Shobha yatra Hanuman devotees paint the Hyderabad City With saffron, Veera Hanuman Vijay Yatra, Sri Hanuman Vijaya Yatra News, Sri Hanuman Vijaya Yatra Latest News, Sri Hanuman Vijaya Yatra Latest Updates, Sri Hanuman Vijaya Yatra Live Updates, hanuman jayanti 2022, Mango News, Mango News Telugu,

శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో విజయయాత్ర వైభవంగా జరుగుతుంది. ముందుగా ఈ రోజు ఉదయం నగరంలోని గౌలిగూడ రామాలయం నుంచి శ్రీ హనుమాన్ విజయ యాత్ర ప్రారంభమైంది. వీహెఛ్పీ, భజరంగ్ దళ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ శోభాయాత్ర గౌలిగూడ శ్రీరామమందిరం నుంచి రాంకోఠి క్రాస్ రోడ్, కాచిగూడ ఎక్స్‌రోడ్స్‌, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, అశోక్‌నగర్‌ క్రాస్ రోడ్స్, గాంధీనగర్‌, బన్సీలాల్‌పేట్‌, బైబుల్‌ హౌస్‌, బ్రూక్‌ బాండ్‌ క్రాస్ రోడ్, మస్తాన్‌ కేఫ్‌ మీదుగా తాడ్‌బండ్‌ లోని శ్రీహనుమాన్‌ ఆలయం వరకు జరగనుంది. మొత్తం 21 కిలోమీటర్ల మేర జరిగే ఈ శోభాయాత్ర రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది. మరోవైపు కర్మన్ ఘాట్ హనుమాన్ మందిరం నుంచి ప్రారంభమయ్యే మరో యాత్ర చాదర్‌ఘాట్‌ మీదుగా వచ్చి కోఠిలోని డీఎం అండ్‌ హెచ్‌ జంక్షన్‌ వద్ద ప్రధాన యాత్రలో కలువనుంది.

ఈ హనుమాన్ శోభాయాత్రలో భక్తులు భారీసంఖ్యలో పాల్గొనడంతో నగరంలో యాత్ర సాగే ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. శోభాయాత్ర నేపథ్యంలో నగర పోలీసులు ముందుగానే అవసరమైన అన్నిచర్యలు చేపట్టి, దాదాపు 8000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే యాత్ర జరిగే ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగానే సమాచారం ఇచ్చారు. దీంతో నగరంలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 2 =