రెవెన్యూ సదస్సుల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్

Telangana CS Somesh Kumar held Video Conference with Collectors over Revenue Conferences, CS Somesh Kumar held Video Conference with Collectors over Revenue Conferences, Somesh Kumar held Video Conference with Collectors over Revenue Conferences, Telangana CS held Video Conference with Collectors over Revenue Conferences, Collectors over Revenue Conferences, Telangana CS Somesh Kumar held Video Conference with Collectors, Video Conference with Collectors over Revenue Conferences, Revenue Conferences, Video Conference with Collectors, Telangana Chief Secretary Somesh Kumar, Telangana CS Somesh Kumar, Chief Secretary Somesh Kumar, Somesh Kumar, Revenue Conferences with Collectors News, Revenue Conferences with Collectors Latest News, Revenue Conferences with Collectors Latest Updates, Revenue Conferences with Collectors Live Updates, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో మిగిలివున్న భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా జూలై 15వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, ఇతర రెవెన్యూ అధికారులతో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 15 నుంచి నిర్వహించే మండల స్థాయి రెవెన్యూ సదస్సులను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లాకలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. రెవెన్యూ సదస్సు షెడ్యూల్‌ లపై విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎస్ సూచించారు.

ఈ రెవెన్యూ సదస్సుల నిర్వహణ వేదికల వద్ద మొబైల్ ఈ-సేవా కేంద్రం, ఇంటర్నెట్, ఇతర మౌలిక సదుపాయాలు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ఈ రెవెన్యూ సదస్సులలో అందే అన్ని దరఖాస్తులకు రసీదులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నెల 11న సీఎం కేసీఆర్ నిర్వహించనున్న కలెక్టర్ల సమావేశానికి, జిల్లా అధికారులు పూర్తి సమగ్ర సమాచారంతో రావాలని సీఎస్ సోమేశ్ కుమార్ కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + twelve =