తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల, మార్చి 23న పోలింగ్

Telangana ECI Releases Election Schedule For 3 MLC Seats in MLA Quota Polling on March 23rd,Election Commission of India Schedule Release,3 MLC Seats in MLA Quota,MLC Elections in Telangana,Election Schedule Polling on March 23rd,Mango News,Mango News Telugu,Election Commission Of India Voters List,Chief Election Commission Of India,Current Election Commission Of India,Election Commission Of India 2023,Election Commission Of India Article,Election Commission Of India Form 6B,Election Commission Of India Identity Card,Election Commission Of India Results,Election Commission Of India Results 2022,Election Commission Of India Up,Election Commission Of India Upsc,Eligibility To Vote In Mlc Elections,Form 6B Election Commission Of India,Graduate Mlc Election,Mlc Elections Apply Online,State Election Commission,Voter Id Search By Name

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఫిబ్రవరి 27, సోమవారం నాడు షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు మార్చి 6, సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. అభ్యర్థులు నామినేషన్స్ దాఖలుకు ఆఖరితేదీ మార్చి 13గా నిర్ణయించారు. నామినేషన్ల పరిశీలన మార్చి 14న చేపట్టనుండగా, ఉపసంహరణకు మార్చి 16 వరకు అవకాశమిచ్చారు. ఇక మార్చి 23వ తేదీన ఉదయం 09:00 నుంచి సాయంత్రం 04:00 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నట్టు ఈసీ వెల్లడించింది.

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీలుగా ఎంపికైన ఎలిమినేటి కృష్ణారెడ్డి, వుల్లోల గంగాధర్‌ గౌడ్‌, కె.నవీన్‌కుమార్‌ ల యొక్క పదవీ కాలం 2023, మార్చి 29వ తేదీతో ముగియనుంది. సభ్యుల పదవీ కాలం ముగియక ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ మూడు స్థానాలకు ఎన్నికలకు ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది.

తెలంగాణలో 3 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల షెడ్యూల్:

  • నోటిఫికేషన్ జారీ – మార్చి 6
  • నామినేషన్లకు ఆఖరితేదీ – మార్చి 13
  • నామినేషన్ల పరిశీలన – మార్చి 14
  • ఉపసంహరణకు ఆఖరుతేదీ – మార్చి 16
  • పోలింగ్ జరిగే తేదీ – మార్చి 23
  • పోలింగ్ సమయం – ఉదయం 09:00 నుంచి సాయంత్రం 04:00 వరకు
  • ఓట్ల లెక్కింపు – మార్చి 23 (సాయంత్రం 5 గంటల నుంచి).

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =