ఏపీలో ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలు విడుదల

AP State Level Police Recruitment Board Released SI Preliminary Written Test Results,AP Police Recruitment Board SI Results,AP SI Preliminary Results Released,AP SI Preliminary Written Test Results,Mango News,Mango News Telugu,Ap Police Recruitment Official Website,Ap Constable Exam Date,Ap Police Constable,Ap Police Official Website,Ap Police Recruitment Apply Online,Ap Police Recruitment Hall Ticket,Ap Si Notification,Ap State Level Police 2023 Results,Ap State Level Police Recruitment Board,Ap State Police Ranks,Police Recruitment Board Ap Hall Ticket,Slprb Ap Gov In,Www Slprb Ap Gov In Apply Online

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 315 ఎస్సై సివిల్ (మెన్ అండ్ విమెన్) పోస్టులు, 96 రిజర్వ్ ఎస్సై ఏపీఎస్పీ (మెన్) పోస్టులు కలిపి మొత్తం 411 పోస్టులకు ఫిబ్రవరి 19వ తేదీన ప్రిలిమినరీ రాత పరీక్షలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏపీఎస్‌ఎల్‌పీఆర్బీ) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీఎస్‌ఎల్‌పీఆర్బీ మంగళవారం ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. 1,51,288 మంది అభ్యర్థులు ఎస్సై పరీక్షలకు హాజరుకాగా, వారిలో 57,923 మంది అభ్యర్థులు అర్హత సాధించారని తెలిపారు. ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలు ‘https://slprb.ap.gov.in/’ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.

ముందుగా ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష (అర్హత పరీక్ష) 2023, ఫిబ్రవరి 19న ఆంధ్ర ప్రదేశ్‌లోని 13 పట్టణాలు/నగరాలలో 291 పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడింది. ఈ పరీక్షకు మొత్తం 1,51,288 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఒక అభ్యర్థి ఒక పేపర్‌లో కూడా అర్హత మార్కులను పొందడంలో విఫలమైతే, వాళ్లు దేహదారుఢ్య పరీక్షలు/ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ)/ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ) లకు అర్హత సాధించరని తెలిపారు.

ఇక ఎస్సై పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ ఆన్సర్ కీ ఫిబ్రవరి 20న విడుదల చేయబడగా, 1553 అభ్యంతరాలు వచ్చాయన్నారు. సబ్జెక్ట్ నిపుణులు ప్రతి అభ్యంతరాలను ధృవీకరించారని, 1వ పేపర్‌కి సంబంధించిన ఆన్సర్ కీలో ఎలాంటి మార్పులు లేవని, అయితే 2వ పేపర్‌లో ఒక ప్రశ్నకు అనేక సరైన సమాధానాలు ఉంటాయి. ఫైనల్ ఆన్సర్ కీ వెబ్‌సైట్‌లో సిద్ధంగా ఉంచబడిందని పేర్కొన్నారు. స్కాన్ చేసిన ఓఎంఆర్ షీట్ డౌన్‌లోడ్ మార్చి 4వ తేదీ ఉదయం 11 గంటల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందన్నారు. అభ్యర్థులు తదుపరి అప్ డేట్స్ కోసం వెబ్‌సైట్ (slprb.ap.gov.in)ని తరచుగా సందర్శించవలసిందిగా సూచించారు. పీఎంటీ/పీఈటీ (స్టేజ్ II ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ) కోసం రిజిస్ట్రేషన్ త్వరలో ప్రారంభమవుతుందని, ఏదైనా స్పష్టత కోసం, అభ్యర్థులు [email protected]కి ఈ-మెయిల్ పంపవచ్చని ఏపీఎస్‌ఎల్‌పీఆర్బీ చైర్మన్ మనీష్ కుమార్ సిన్హా ఒక ప్రకటనలో సూచించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − three =