డిసెంబర్ 20న ఎల్.బి.స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ విందు

Christmas 2019, Christmas Celebrations 2019, Mango News Telugu, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana Christmas Dinner, Telangana Govt To Host Christmas Dinner, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని డిసెంబర్ 20, శుక్రవారం సాయంత్రం ఎల్.బి.స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించనున్న క్రిస్మస్ విందుకు అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో క్రిస్మస్ విందు ఏర్పాట్ల పై రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి సి.హెచ్.మల్లా రెడ్డి లతో కలిసి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని పండుగల లాగానే క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారని, ఈ విందుకు సుమారు పది వేల మంది హాజరవుతున్నందున వచ్చే అతిధులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. శానిటేషన్, మొబైల్ టాయిలెట్స్, మంచి నీటి సౌకర్యాలు, పూల అలంకరణ, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఎల్.ఈ.డి స్ర్కీన్ డిస్ప్లేల ఏర్పాట్లు, బందోబస్తు, ట్రాఫిక్, నిరంతర విద్యుత్ సరఫరా తదితర ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. అర్హులైన క్రైస్తవులకు బహుమతి ప్యాకెట్లను ఇప్పటికే పంపిణీ చేశామన్నారు.

అలాగే ఈ నెల 18వ తేదిన రాష్ట్ర మంత్రుల ఆధ్వర్యంలో ఎల్.బి.స్టేడియంను సందర్శించి క్రిస్మస్ విందు ఏర్పాట్లను పరిశీలిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మాట్లాడుతూ, అందరు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని సూచించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సి.హెచ్.మల్లా రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా క్రిస్మస్ విందును ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో మైనారిటీల సంక్షేమ సలహాదారు ఎ.కె.ఖాన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్, ఎం.ఎల్.సి రాజేశ్వర్ రావు, ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్, జి.హెచ్.యం.సి డిప్యూటీ మేయర్ బాబా ఫసియెుద్దీన్, మైనారిటీల సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, డైరెక్టర్ షాన్ వాజ్ ఖాసిమ్, డిసిపి జోయల్ డేవిస్, తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్సు కార్పొరేషన్ యం.డి. ఎ.హెచ్.ఎన్ కాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here