తెలంగాణ‌లోకి నైరుతి రుతుప‌వ‌నాల ఆగమనం.. మూడు రోజుల భారీ వ‌ర్ష సూచ‌న చేసిన వాతావరణ శాఖ

Telangana IMD Hyderabad Predicts Heavy Rains in Next 3 Days While Southwest Monsoon Enters The State on Monday, Telangana IMD Hyderabad Predicts Heavy Rains in Next 3 Days, While Southwest Monsoon Enters The State on Monday, IMD Hyderabad Predicts Heavy Rains in Next 3 Days, Telangana IMD Hyderabad Predicts Heavy Rains, IMD Hyderabad Predicts Heavy Rains, Heavy Rains, Telangana IMD Hyderabad, Southwest Monsoon, Southwest Monsoon Enters The Telangana, Southwest Monsoon News, Southwest Monsoon Latest News, Southwest Monsoon Latest Updates, Southwest Monsoon Live Updates, Mango News, Mango News Telugu,

గడచిన 4 నెలలుగా ఎండలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు శుభవార్త. ఇకపై రాష్ట్రంలో వాతావరణం చల్లబడనుంది. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ, తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు సోమవారం ప్రవేశించాయని ప్రకటించింది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా వ‌ర‌కు రుతుపవ‌నాలు విస్త‌రించిన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. కాగా రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావంతో రాబోయే రెండు, మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే సాధారణంగా జూన్ 8 నాటికి తెలంగాణకు వచ్చే రుతుపవనాలు, ఈ సంవత్సరం ఉపరితలం నుండి వచ్చే వేడికి అధిక రేడియేషన్ మరియు పేలవమైన నైరుతి గాలుల కారణంగా ఆలస్యమైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

రుతుపవనాల కారణంగా ఈరోజు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, అలాగే రేపు మరియు ఎల్లుండి అనేక ప్రాంతాల్లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు సూచించారు. ప్రస్తుతం రుతుపవనాలు వ్యాపించిన రాష్ట్రాలు.. ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, కొంకణ్‌లోని మిగిలిన ప్రాంతాలు, గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు, మధ్య మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు, మొత్తం కర్ణాటక మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య ప్రాంతాలు. రానున్న 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతం మొత్తం రుతుపవనాలు ఆవరించే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 10 =