తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు ఫిబ్రవరి 22 వరకు పెంపు

Telangana Inter Board Extends Inter Exam Fee Due Dates,Mango News,Mango News Telugu,Telangana inter board extends date for exam fee payment,TS Inter Exam Fee Due Dates 2021,TSBIE,TSBIE Fee Due Dates 2021,Intermediate exam fee date is Feb. 11,TS Inter Exam Fee Dates 2021 are announced by Board Of Intermediate Education Telangana on its official website for Intermediate 1st year & 2nd Year Annual Examinations

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ఇటీవలే ఇంటర్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు తుడుగడువును ఫిబ్ర‌వ‌రి 11 గా నిర్ణయించారు. అయితే విద్యార్థులు, త‌ల్లిదండ్రుల వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ఫీజు గడువును ఫిబ్రవరి 22వ తేదీ వ‌ర‌కు పొడిగించిన‌ట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్‌ గురువారం నాడు వెల్లడించారు. అలాగే కాలేజీల్లో ట్యూషన్‌ ఫీజు, పరీక్ష ఫీజుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు ఎలాంటి షరతులు విధించకుండా పరీక్ష ఫీజు తీసుకుని బోర్డుకు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరోవైపు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఇప్పటికే విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం మొదటి సంవత్సరం పరీక్షలు మే 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మే 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజు చెల్లింపుల వివరాలు:

  • ఫీజు చెల్లింపు ప్రారంభమైన తేదీ : జనవరి 30
  • ఫీజు చెల్లింపు తుది గడువు : ఫిబ్రవరి 22 (ఆలస్య ఫీజు లేకుండా)
  • రూ.100 ఆలస్య ఫీజుతో చెల్లింపు గడువు: మార్చి 1
  • రూ.500 ఆలస్య ఫీజుతో చెల్లింపు గడువు: మార్చి 8
  • రూ.1000 ఆలస్య ఫీజుతో చెల్లింపు గడువు: మార్చి 15
  • రూ.2000 ఆలస్య ఫీజుతో చెల్లింపు గడువు: మార్చి 22
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 16 =