ధరణికి సంబంధించిన అంశాలపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష

Telangana CS Somesh Kumar Held Review Meeting with officials on Dharani,Mango News,Mango News Telugu,CS Somesh Kumar holds review meeting with officials on Dharani,CS Somesh Kumar holds review meeting with officials on Dharani,Telangana Chief Secretary meets officials as state gears up for Dharani,CS Somesh Kumar Latest News,CS Somesh Kumar Review Meeting With Dharani Officials

ధరణికి సంబంధించిన అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం కేసీఆర్ ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావులు సంబంధిత అధికారులతో బిఆర్కెఆర్ భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అంశాలను పరిష్కరించడంతో పాటు క్లియర్ చేయడానికి పలు చర్యలు తీసుకున్నట్లు సమావేశంలో గుర్తించారు. ధరణిలోని పెండింగ్ మ్యుటేషన్ మాడ్యూల్ ద్వారా 74688 దరఖాస్తులు రాగా 62847 దరఖాస్తులను కలెక్టర్లు పరిష్కరించారు.

సంస్ధలకు, కంపెనీలకు పట్టదారు పాస్ పుస్తకాలు జారీ చేయడానికి అవసరమైన మాడ్యూల్ ధరణిలో అందుబాటులో ఉంచడంతో పాటు ఎన్ఆర్ఐ మాడ్యూల్ ను కూడా అందుబాటులోకి తేవడం జరిగింది. సంస్ధలు, కంపెనీల పేర రిజిష్ట్రేషన్ మాడ్యూల్ అభివృద్ధి దశలో ఉందని ఫిబ్రవరి,15 నాటికి అందుబాటులోకి తేవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలలో మాడ్యూల్ వినియోగంపై అధ్యయనం కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటుచేసి గ్రామాలలో పర్యటించాల్సిందిగా సీఎస్ ఆదేశించారు.

ఈ టీంలు మాడ్యూల్స్ అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, సమస్యల పరిష్కారానికి సలహాలు ఇస్తుందని చెప్పారు. కలెక్టర్లు ధరణికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కరించాలని, ముఖ్యంగా పార్ట్-బి లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రధ్ధ చూపించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఈ సమావేశంలో సీఐజీ వి.శేషాద్రి, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, టిఎస్ టిఎస్ ఎండీ జి.టి వెంకటేశ్వర్ రావు, సిసిఎల్ఏ స్పెషల్ ఆఫీసర్ సత్యశారద, బి.రామయ్య (రిటైర్డ్), సిసిఎల్ఏ ఓఎస్డి (ఎల్ఏం అండ్ ఎల్ఏఆర్ సుందర్ అబ్ నార్ మరియు తదితర అధికారులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 6 =