జూలై 18 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిర్వహణ

Parliament Monsoon Session to be held from July 18 to August 12th, Parliament Monsoon Session to be Start from July 18, Parliament Monsoon Session to be End On August 12th, Parliament Monsoon Session, monsoon session of Parliament will commence on July 18 and continue till August 12, Parliament Secretariat announced, monsoon session of Parliament, Monsoon session to be held from July 18 to August 12th, Parliament, Parliament Monsoon Session News, Parliament Monsoon Session Latest News, Parliament Monsoon Session Latest Updates, Parliament Monsoon Session Live Updates, Mango News, Mango News Telugu,

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు లోక్​సభ, రాజ్యసభ సెక్రెటేరియేట్స్ గురువారం నోటిఫికేషన్స్ విడుదల చేశాయి. ఈ సెషన్‌లో ఉభయసభల్లో మొత్తం 18 రోజుల పాటుగా సమావేశాలను నిర్వహించనున్నారు. కాగా ఈ వర్షాకాల సమావేశాల్లోనే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక జూలై 18న, ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది.

వర్షాకాల సమావేశాల్లో తొలి రోజునే రాష్ట్రపతి ఎన్నిక జరగనుండగా, ఓట్ల లెక్కింపు జూలై 21న చేపట్టనున్నారు. జూలై 25న పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే విధంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న నిర్వహించనుండగా, ఆగస్టు 11న నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసి, పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మరోవైపు 2022 శీతాకాల సమావేశాలు పార్లమెంట్ కొత్త భవనంలో జరుగుతాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించిన నేపథ్యంలో ఈ వర్షాకాల సమావేశాలే ప్రస్తుత పార్లమెంట్ భవనంలో చివరి సెషన్ అయ్యే అవకాశం ఉంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 3 =