రేపు గ్రేటర్ పోలింగ్ కు సర్వం సిద్ధం, మాస్కు తప్పనిసరి

GHMC, GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Updates, GHMC Polling will be Conducted Tomorrow in 150 Divisions, Greater Hyderabad Municipal Corporation, Greater Hyderabad Municipal Corporation polls, Hyderabad civic polls, Hyderabad Municipal Election, Mango News

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు రేపు జరగనున్న పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 150 డివిజన్లకు గానూ 9101 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణలో 48 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు. వీరితో పాటుగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, సర్వెలెన్స్‌ బృందాలు కూడా పాల్గొంటాయి. నగరంలో ముందుగా ఏర్పాటు చేసిన 30 డీఆర్సీ కేంద్రాల వద్ద పోలింగ్ కేంద్రాలకు అవసరమైన సామగ్రితో పాటుగా కరోనా కిట్లు, శానిటైజర్లను పోలింగ్ అధికారులకు ఈ రోజు పంపిణీ చేశారు.

ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి: 

మరోవైపు గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 74,44,260 మంది ప్రజలు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఓటర్లలో 38,77,688 మంది పురుషులు, 35,65,896 మంది మహిళలు ఉన్నారు. నగరంలో 79,290 ఓటర్లతో మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ పెద్దదికాగా, రామచంద్రాపురం డివిజన్‌లో అత్యల్పంగా 27,998 మంది ఓటర్లు ఉన్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని పేర్కొన్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగనుండగా, కరోనా బాధితులు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఇక ఈ ఎన్నికలకు టిఆర్ఎస్ పార్టీ నుంచి 150 డివిజన్లలో అభ్యర్థులు బరిలో ఉండగా, బీజేపీ నుంచి నవాబ్‌ సాహికుంటలో మినహా మిగతా 149, కాంగ్రెస్ పార్టీ 146, టీడీపీ 106, ఎంఐఎం 51, సీపీఐ 17, సీపీఎం 12, ఇండిపెండెంట్ గా 415 మంది పోటీ చేస్తున్నారు. 150 డివిజన్లకు గానూ అన్ని పార్టీల నుంచి 1122 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =