తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 449 కేసులు నమోదవడంతో ఆగస్టు 8, ఆదివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,49,406 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో ఇద్దరు మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3,825 కి పెరిగింది.
ఇక గత 24 గంటల్లో 623 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 6,37,175 కు చేరుకుంది. ప్రస్తుతం 8,406 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. మరోవైపు ఆదివారం నాడు 79,231 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 2,28,22,154 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 6,13,169 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ