పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేని ప్రారంభించిన ప్రధాని మోదీ

Karwal Kheri, Mango News, Narendra Modi, Narendra Modi Inaugurates Purvanchal Expressway at Karwal Kheri in Uttarpradesh, PM Inaugurates Purvanchal Expressway, PM Modi inaugurates Purvanchal Expressway, PM Modi inaugurates Purvanchal Expressway in Uttar Pradesh, pm narendra modi, PM Narendra Modi Inaugurates Purvanchal Expressway at Karwal Kheri in Uttarpradesh, Purvanchal Expressway at Karwal Kheri, Purvanchal Expressway at Karwal Kheri in Uttarpradesh, Purvanchal Expressway inauguration, Purvanchal Expressway Inauguration Highlights, Purvanchal Expressway inauguration Live Updates, Purvanchal Expressway News, Uttarpradesh

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 16, మంగళవారం నాడు ఉత్తరప్రదేశ్‌ లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సుల్తాన్‌పూర్ జిల్లాలోని కర్వాల్ ఖేరీ వద్ద పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేని ప్రధాని మోదీ ప్రారంభించారు. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవం తర్వాత, అత్యవసర పరిస్థితుల్లో భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ విమానాలను ల్యాండింగ్/టేకాఫ్ చేసేందుకు వీలుగా ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మించిన 3.2 కి.మీ పొడవైన ఎయిర్‌స్ట్రిప్‌లో జరిగిన భారత వైమానిక దళం ఎయిర్‌షోను కూడా ప్రధాని వీక్షించారు.

కాగా పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే పొడవు మొత్తం 341 కి.మీ. ఈ ఎక్స్‌ప్రెస్‌వే లక్నో-సుల్తాన్‌పూర్ రహదారి (NH-731)లో ఉన్న లక్నో జిల్లా చౌదసరాయ్ గ్రామం నుండి ప్రారంభమై, ఉత్తర్ ప్రదేశ్-బీహార్ సరిహద్దుకు తూర్పున 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాతీయ రహదారి నెం.31పై ఉన్న హైదరియా గ్రామం వద్ద ముగుస్తుంది. అలాగే ఈ ఎక్స్‌ప్రెస్‌వే 6-లేన్‌ల వెడల్పును కలిగి ఉండగా, భవిష్యత్తులో దీనిని 8-లేన్‌లకు విస్తరించే అవకాశం ఉంది. దాదాపు 22500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించబడిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు భాగం ముఖ్యంగా లక్నో, బారాబంకి, అమేథీ, అయోధ్య, సుల్తాన్‌పూర్, అంబేద్కర్ నగర్, అజంగఢ్, మౌ మరియు ఘాజీపూర్ జిల్లాల ఆర్థికాభివృద్ధికి ఊతం ఇవ్వనుందని భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + seventeen =