తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ నెల 9న ప్ర‌జా క‌వి కాళోజీ జ‌యంతిని రాష్ట్ర పండుగ‌గా నిర్వ‌హించాల‌ని ఉత్త‌ర్వులు

Telangana Govt Orders For Celebrating The Kaloji Birth Anniversary as State Festival on September 9th, Kaloji Birthday as Telangana Language Day, Telangana Language Day on September 9, TS Govt To Celebrate Kaloji Centenary, Kaloji Birth Anniversary, Mango News, Mango News Telugu, Telangana Language Day, Kaloji Telangana State Festival, September 9th Telangana Language Day, Telangana Poet Kaloji Birthday, Kaloji Narayana Rao

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రఖ్యాత ప్ర‌జా క‌వి కాళోజీ నారాయ‌ణ‌రావు జ‌యంతిని వేడుకగా ఘనంగా నిర్వహించటానికి సన్నద్ధమవుతోంది. ఈ మేరకు తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 9వ తేదీన కాళోజీ జ‌యంతి సంద‌ర్భంగా.. అన్ని ప్ర‌భుత్వ శాఖ‌లు, కార్పొరేష‌న్ల‌లో ఉత్స‌వాలు నిర్వ‌హించాల‌ని ఆదేశించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థ‌లు, స్థానిక సంస్థ‌ల్లో దీనిని జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అదేవిధంగా అన్ని జిల్లాల్లోనూ కాళేజీ జ‌యంతిని ఘనంగా జ‌ర‌పాల‌ని ప్ర‌భుత్వం క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇప్పటికే కాళోజీ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 9న తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ భాషా దినోత్సవం’గా పరిగణించి వేడుకలు నిర్వహిస్తుండటం తెలిసిన సంగతే. ఆ రోజున ఆయన గౌరవార్థం కాళోజీ స్మారక అవార్డును ఏర్పాటు చేసి తెలంగాణ భాష మరియు సాహిత్యానికి విశేష కృషి చేసిన వారికి దానిని అందజేయడం జరుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 18 =