తెలంగాణ ఎంసెట్-2022 ఫార్మసీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల

Telangana EAMCET-2022 Pharmacy Counseling Schedule Released, Telangana EAMCET-2022 Pharmacy Counseling, Telangana EAMCET-2022 Pharmacy Counseling Schedule, Telangana Pharmacy Counseling, TS -2022 Pharmacy Counseling Counseling, TS Pharmacy Counseling Schedule, TS Pharmacy Counseling Schedule, Mango News, Mango News Telugu, Telangana-2022 Pharmacy Counseling, TS Pharmacy Counseling Results, TS Pharmacy Counseling 2022 Dates Released, TS Pharmacy Counseling Schedule, Telangana Pharmacy Counseling 2022, TS Pharmacy Counseling Latest News And Updates

తెలంగాణ రాష్ట్రంలో బీ ఫార్మసీ, ఫార్మ్‌ డీ, బయోటెక్నాలజీ సీట్ల భర్తీకి సంబంధించిన ఎంసెట్‌-2022 ఫార్మసీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదలైంది.‌ నవంబర్ 1వ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు టీఎస్ ఎంసెట్‌-2022 అడ్మిషన్స్ కన్వీనర్, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు విడతల్లో సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తయ్యేలా షెడ్యూల్‌ రూపొందించినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షకు 80,575 మంది విద్యార్థులు హాజరుకాగా, 71,180 మంది అనగా 88.34 శాతం మంది అర్హత సాధించిన విషయం తెలిసిందే.

టీఎస్‌ ఎంసెట్-2022 ఫార్మసీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్:

తొలివిడత:

  • ఆన్‌లైన్ లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం
  • స్లాట్ బుకింగ్ – నవంబర్ 1 నుంచి నవంబర్ 3 వరకు
  • స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే తేదీలు – నవంబర్ 3 నుంచి నవంబర్ 4 వరకు
  • వెబ్‌ ఆప్షన్స్ పక్రియ – నవంబర్ 3 నుంచి నవంబర్ 6 వరకు
  • మొదటి విడత సీట్లు కేటాయింపు – నవంబర్ 9
  • వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ – నవంబర్ 9 నుంచి నవంబర్ 13 వరకు

చివరి విడత:

  • ఆన్‌లైన్ లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ – నవంబర్ 17
  • స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే తేదీలు – నవంబర్ 18
  • వెబ్‌ ఆప్షన్స్ పక్రియ – నవంబర్ 18, 19
  • చివరి విడత సీట్లు కేటాయింపు – నవంబర్ 22
  • వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ – నవంబర్ 22 నుంచి నవంబర్ 24 వరకు
  • సీట్లు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయడం – నవంబర్ 22 నుంచి నవంబర్ 25 వరకు
  • ప్రైవేట్ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్స్ గైడ్ లైన్స్ వెబ్ సైట్ లో అందుబాటు – నవంబర్ 23.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 4 =