ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదైన 5 దేశాలు ఇవే …

Corona Positive Cases Worldwide, Coronavirus Cases, coronavirus cases india, Coronavirus cases Worldwide, coronavirus deaths worldwide, coronavirus india, coronavirus india live updates, Coronavirus Update, Worldwide Corona Positive Cases, Worldwide Corona Positive Cases Crosses 4.5 Crore Mark, Worldwide Coronavirus cases List

ప్రపంచంలోని పలుదేశాల్లో కోవిడ్-19 (కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. తాజాగా అన్ని దేశాల్లో కలిపి జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ గణాంకాల ప్రకారం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4.5 కోట్లు (4,50,75,642) దాటింది. వీరిలో ఇప్పటిదాకా 3.03 కోట్లకు పైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 11.8 లక్షల మందికి పైగా మరణించారు. వైరస్ నియంత్రణకు కొన్ని దేశాలు కఠిన నివారణ చర్యలు అవలంభించడంతో ఆయా దేశాల్లో కరోనా ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టగా, మరికొన్ని దేశాల్లో వైరస్ సంక్రమణ రెండో దశకు చేరుకుంది. రెండో వేవ్ కరోనా తీవ్రతతో ఫ్రాన్స్, జర్మనీ సహా పలు దేశాలు మళ్ళీ లాక్ డౌన్ బాటపడుతున్నాయి. ఇప్పటివరకు అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కరోనా కేసులు నమోదవగా, ఆ తర్వాత స్థానాల్లో భారత్‌, బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్,స్పెయిన్, అర్జెంటైనా, కొలంబియా దేశాలు ఉన్నాయి.

ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన 5 దేశాలు:

అమెరికా – 89,46,876
భారత్ – 80,88,851
బ్రెజిల్ – 54,94,376
రష్యా – 15,88,433
ఫ్రాన్స్ – 13,27,853

ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు నమోదైన 5 దేశాలు:

అమెరికా – 2,28,675
బ్రెజిల్ – 1,58,969
భారత్ – 1,21,090
మెక్సికో – 90,773
యూకే – 46,045

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 8 =