జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికపై నోటిఫికేషన్‌ విడుదల, ఫిబ్రవరి 11 న ఎన్నిక

2021 GHMC Mayor Election, ghmc elections 2021, GHMC Mayor Election, GHMC Mayor Election 2021, GHMC mayor polls, GHMC polls, Greater Hyderabad Municipal Corporation, Hyderabad, Mango News, New mayor for GHMC, Notification For GHMC Mayor Election, SEC Released Notification For GHMC Mayor Election, telangana, Telangana News, Telangana Political News, Telangana SEC

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ మరియు డిప్యూటీ మేయర్‌ పరోక్ష ఎన్నికకు సంబంధించి శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ‌విడుదల చేసింది. ఫిబ్రవరి 11 వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్‌ ఎన్నిక, ఆ తర్వాత వెంటనే డిప్యూటీ మేయర్‌ ఎన్నిక చేపట్టనున్నట్లు తెలిపారు. ముందుగా ఫిబ్రవరి 11 ఉదయం 11.00 గంటలకు ఇటీవల 150 డివిజన్లకు కొత్తగా ఎన్నికైన అభ్యర్థులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

మరోవైపు ఏదైనా కారణాల చేత ఫిబ్రవరి 11 న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించలేకపొతే, మరుసటి రోజైన ఫిబ్రవరి 12న ఎన్నిక జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. గత డిసెంబర్ 1 న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగగా, డిసెంబర్ 4 న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 150 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ 56, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ పార్టీ‌ 2 గెలుచుకున్నాయి. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల పేర్లతో ఇటీవలే రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్‌ నోటిఫికేషన్ ‌జారీ చేసింది. తాజాగా మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కోసం కూడా నోటిఫికేషన్ విడుదలైంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =