మాజీ మంత్రి అఖిలప్రియకు బెయిల్‌, భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్‌ పిటిషన్ కొట్టివేత

Secunderabad Court Sanctioned Bail For Bhuma Akhila Priya In Bowenpally Kidnap Case

బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టై రిమాండులో ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు శుక్రవారం నాడు బెయిల్ మంజూరు అయింది. సికింద్రాబాద్‌ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు వెల్లడించింది. రూ.10 వేల పూచీకత్తుతో పాటుగా మరికొన్ని ఇతర షరతులను కోర్టు విధించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అఖిలప్రియ శనివారం నాడు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు కిడ్నాప్‌ కేసులో ఏ3 నిందితుడుగా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్‌ రామ్‌ సికింద్రాబాద్‌ కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు విచారణ సందర్భంగా భార్గవ్ రామ్ కు బెయిల్‌ ఇవ్వొద్దని, ఈ కేసులో ఆయనకు విచారించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం భార్గవ్ ‌రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ ను కోర్టు కొట్టివేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 3 =