అరవింద్ గౌడ్‌ చేతికి తెలంగాణ టీడీపీ పగ్గాలు?

Telangana TDP reins to Arvind Goud,Telangana TDP reins,TDP reins to Arvind Goud,Mango News,Mango News Telugu,telugu desam party, TTDP, chandrababu naidu, aravind goud, kasani gnaneshwar, telangana assembly elections,Telangana TDP Latest News,Telangana TDP Latest Updates,Telangana TDP Live News,Telangana 2023 Election,chandrababu naidu Latest News,chandrababu naidu Latest Updates,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Arvind Goud Latest News,Arvind Goud Latest Updates
telugu desam party, TTDP, chandrababu naidu, aravind goud, kasani gnaneshwar, telangana assembly elections

తెలంగాణ టీడీపీలో మొన్నటి వరకు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ పార్టీకి సరైన దిశానిర్దేశం చేసే నాయకుడే కరువైపోయారు. చంద్రబాబు జైలుకు వెళ్లడం.. నారా లోకేష్, భువనేశ్వరి ఏపీపైనే ఫోకస్ పెట్టడంతో.. ఇక్కడ పార్టీని పట్టించుకునే వారు లేకుండా పోయారు. అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చంద్రబాబు జైలు నుంచి కబురు పంపించారు. దీంతో అప్పటి వరకు పెద్ద దిక్కుగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ కూడా పార్టీకి.. పదవికి గుడ్ బై చెప్పేశారు. దీంతో ఏం చేయాలో అర్థంకాక.. పట్టించుకునే నాథుడే లేక కేడర్ చెల్లాచెదురైపోతోంది.

అయితే ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ తీసుకొని బయటకొచ్చారు. అయితే బయటికి రావడంతోనే ఆయన తెలంగాణపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీని అలాగే వదిలేయకుండా కొత్త అధ్యక్షుడిని వెతికే పనిలో పడినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వీలైనంత త్వరగా టీటీడీపీకి కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారట. కొత్త అధ్యక్షుడి కోసం సెర్చింగ్ మొదలు పెట్టారట.

అయితే ఇప్పటి వరకు ముగ్గురి పేర్లు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ముగ్గురి పేర్లు పరిశీలించాక.. తనకు అత్యంత సన్నిహితుడైన అరవింద్ గౌడ్‌కు టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు  చెబుతున్నాయి. దేవేందర్ గౌడ్ మేనల్లుడు అరవింద్ గౌడ్. ఇద్దరూ ఒకేసారి తెలుగు దేశం పార్టీలో చేరారు. కానీ కొద్దిరోజులకు దేవేందర్ గౌడ్ మరో పార్టీలోకి జంప్ అయినప్పటికీ.. అరవింద్ గౌడ్ మాత్రం టీడీపీలోనే ఉన్నారు. పోయిన సారి ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినప్పటికీ.. అరవింద్ గౌడ్ మాత్రం పార్టీని వదిలిపెట్టలేదు.

అయినప్పటికీ పార్టీకి విధేయుడిగా ఉండడం.. పైగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడంతో అరవింద్ గౌడ్‌కు అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు కసరత్తు చేస్తున్నారట. అన్నీ అనుకూలంగా ఉంటే.. త్వరలోనే దీనిపై చంద్రబాబు అధికారికంగా ప్రకటన చేయనున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరి ఎన్నికల వేళ అధ్యక్షుడు మారితే ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + eleven =