ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డికి రెండోసారి కరోనా

Andhra Pradesh, ap coronavirus cases today, AP Coronavirus News, Bhumana Karunakar Reddy, Bhumana Karunakar Reddy Tests Corona Positive, MLA Bhumana Karunakar Reddy, MLA Bhumana Karunakar Reddy Tests Corona Positive, Tirupati MLA, Tirupati MLA Bhumana Karunakar Reddy, Tirupati MLA Tests Corona Positive for Second Time

చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి కి ఆగస్టు నెలలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడంతో రుయా ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి రెండోసారి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. తిరుపతిలో బుధవారం నాడు ఓ ప్రైవేటు ల్యాబ్‌ లో నిర్వహించిన పరీక్షలో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో గురువారం నాడు మరోసారి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుని, తదుపరిగా వైద్యసేవలు పొందేందుకు ఎమ్మెల్యే సిద్దమయినట్టుగా తెలుస్తుంది. ఒకసారి కరోనా వచ్చిన వ్యక్తికి రెండోసారి వైరస్ సోకడమనేది అరుదుగా జరుగుతుంది. దేశంలో ఇప్పటికి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అలాంటి కేసులు అతి అరుదుగా నమోదు అవుతున్నాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 5 =