మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి భేటీ

Ex- MP Konda Vishweshwar Reddy, Konda Vishweshwar, Konda Vishweshwar Reddy To Join Congress, Mango News, manog news, Revanth Reddy, revanth reddy latest news, Revanth Reddy Meets Ex- MP, Revanth Reddy Meets Ex- MP Konda Vishweshwar Reddy, Revanth Reddy meets Konda Vishweshwar, TPCC President, TPCC President Revanth Reddy, TPCC President Revanth Reddy Meets Ex- MP Konda Vishweshwar Reddy Today

తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి మంగళవారం నాడు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని కలుసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైనప్పటి నుంచి రేవంత్ రెడ్డి పలువురు కీలక నాయకులను కలుసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగే అవకాశమునట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు రేవంత్ రెడ్డితో భేటీపై కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ట్వీట్ చేశారు. “టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డిని అభినందించాను. నిరుద్యోగం, నీటిపారుదల, కృష్ణ జలాలు, వ్యవసాయం, ఉత్పత్తుల సేకరణ, కనీస మద్దతు ధర, సేవింగ్ డెమోక్రసీ సహా వివిధ తెలంగాణ సమస్యలపై చర్చించాము. కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత రేవంత్ రెడ్డిని కలవడం ఇదే మొదటిసారి” అని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 12 =