మునుగోడు ఉపఎన్నికలో పార్టీ కోసం శ్రమించిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్

TRS Working President KTR Thanked Party Leaders Cadre For Working in Munugode By-Poll, KTR Thanked Party Leaders, TRS Cadre For Working in Munugode By-Poll,TRS Working President KTR,Mango News,Mango News Telugu,Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates

తెలంగాణ రాష్ట్రంలో గత నెలరోజులుగా ఆసక్తికరంగా మారిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ పక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. మునుగోడులో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు నియోజకవర్గవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మునుగోడు ఉపఎన్నిక కోసం గత నెల రోజులుగా పార్టీ కోసం శ్రమించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులు అందరికీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు తమ తమ ప్రాంతాల నుంచి వచ్చి, మునుగోడులో పార్టీ గెలుపు కోసం పనిచేసిన ఇంచార్జ్ లకి, వారితో వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

“మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చి, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన వామపక్ష నాయకులకు, కార్యకర్తలకు మనః పూర్వక కృతజ్ఞతలు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియచేయడంతో పాటు, ప్రత్యర్ధి పార్టీల కుట్రలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించిన సోషల్ మీడియా వారియర్లకు పార్టీ తరపున ధన్యవాదాలు” అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − six =