పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక

Mango News, MP Vijayasai Reddy, MP Vijayasai Reddy Elected as PAC Member, MP Vijayasai Reddy Elected as Public Accounts Committee Member, MP Vijayasai Reddy Unanimously Elected as Public Accounts Committee Member, Public Accounts Committee Member, Vijayasai Reddy, YSRCP, YSRCP MP Vijayasai Reddy, YSRCP MP Vijayasai Reddy Unanimously Elected As PAC, YSRCP MP Vijayasai Reddy Unanimously Elected as Public Accounts Committee Member, YSRCP Rajya Sabha member Vijayasai Reddy

వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి లభించింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా విజయసాయిరెడ్డి మంగళవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. విజయసాయిరెడ్డితో పాటుగా బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది కూడా పీఏసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్‌దీపక్ శర్మ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) అనగా కేంద్ర ప్రభుత్వ ఆదాయాన్ని మరియు ఖర్చులను ఆడిట్ చేయడానికి పార్లమెంటు చేత ఏర్పాటు చేయబడిన పార్లమెంటు సభ్యుల కమిటీ. పీఏసీలో లోక్ సభ నుంచి 15 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి ఏడుగురు ఎంపీలు కలిపి మొత్తం 22 మంది సభ్యులు ఉంటారు. ఇటీవల కేంద్ర మంత్రివర్గ విస్తరణ అనంతరం పీఏసీలో రెండు స్థానాలు ఖాళీ అవడంతో నామినేషన్ల అనంతరం విజయసాయిరెడ్డి, సుధాంశు త్రివేది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =