ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Andhra Pradesh Intermediate Exam 2020 Schedule, AP Inter Exam Dates, AP Intermediate Exam 2020, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Inter Exam 2020 Schedule, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ను డిసెంబర్ 2, సోమవారం నాడు ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. మార్చి 4 నుంచి 21 వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు, మార్చి 5 నుంచి 23 వరకు ఇంటర్‌ రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. అన్ని పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య నిర్వహించబడతాయి. సాధారణ విద్యార్థులతో పాటు ఒకేషనల్‌ కోర్సు విద్యార్థులకూ కూడా ఇవే తేదీలు వర్తిస్తాయి. అలాగే ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. జనవరి 28వ తేదీన నైతిక, మానవ విలువల పరీక్ష మరియు జనవరి 30న పర్యావరణ విద్య పరీక్ష జరగనున్నాయి. జంబ్లింగ్‌ విధానంలో అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయించబోతున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ షెడ్యూల్‌ను వెల్లడించారు.

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

మార్చి 4: సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 1
మార్చి 6: ఇంగ్లీష్ పేపర్-1
మార్చి 9: మ్యాథమేటిక్స్ పేపర్- 1A, బోటనీ పేపర్- 1, సివిక్స్ పేపర్- 1,
మార్చి 12: మ్యాథమేటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్ -1, హిస్టరీ పేపర్ -1
మార్చి 14: ఫిజిక్స్ పేపర్ -1, ఎకనామిక్స్ పేపర్ -1
మార్చి 17: కెమిస్ట్రీ పేపర్ -1, కామర్స్ పేపర్ -1, సోషియాలజీ పేపర్ -1, ఫైనర్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ -1
మార్చి 19: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, లాజిక్ పేపర్ -1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -1 (బైపిసి విద్యార్థులకు)
మార్చి 21: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -1 మరియు జాగ్రఫీ పేపర్ -1.

ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

మార్చి 5: సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 2
మార్చి 7: ఇంగ్లీష్ పేపర్ -2
మార్చి 11: మ్యాథమేటిక్స్ పేపర్- 2A, బోటనీ పేపర్- 2, సివిక్స్ పేపర్- 2
మార్చి 13: మ్యాథమెటిక్స్ పేపర్- 2B, జువాలజీ పేపర్- 2, హిస్టరీ పేపర్- 2
మార్చి 16: ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
మార్చి 18: కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్ -2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ -2
మార్చి 20: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, లాజిక్ పేపర్ -2, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -2
మార్చి 23: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -2, జాగ్రఫీ పేపర్ -2.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =