ఆంధ్రప్రదేశ్ కు మళ్ళీ భారీ వర్ష సూచన

Andhra Pradesh, Andhra Pradesh Floods, Andhra Pradesh Rains, Andhra Pradesh To Witness Heavy Rains, AP Heavy Rains, AP Rains, AP Rains News, AP to witness rains, AP Weather report, CM YS Jagan, Heavy Rain To Continue In Districts Of AP, Heavy Rain To Continue Of AP, Heavy Rains, Heavy Rains In Andhra Pradesh, Heavy Rains In AP, Mango News, Mango News Telugu, Weather Forecast Highlights, Weather update AP

ఆంధ్రప్రదేశ్ కు మళ్ళీ భారీ వర్ష సూచన అందింది. ఇటీవల కురిసిన వర్షాలకి రాష్టంలోని పలు జిల్లాలు అస్తవ్యస్తం అయ్యాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు ఈ భారీ వర్షాలకు అతలాకుతలమయ్యాయి. కొన్ని గ్రామాలు ఏకంగా వరద నీటిలో మునిగిపోయాయి. ఎంతో ఆస్థి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఆయా ప్రాంతాల ప్రజలు ఆ కష్టం నుంచి ఇంకా కోలుకోనేలేదు. ఇప్పుడు వాతావరణశాఖ మరో పిడుగులాంటి వార్త తెలిపింది. వచ్చే 3 రోజులూ ఆంధ్రప్రదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతాయని తెలియజేసింది.

దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. రాయలసీమ జిల్లాలైన కడప, అనంతపురం లలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, హైదరాబాద్ లో మోస్తరు వర్షాలు పడొచ్చని సూచించింది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో చిరుజల్లులు పడొచ్చని తెలియజేసింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =