ఓబులాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ఊరట, అభియోగాలను కొట్టివేసిన హైకోర్టు

AP Cadre Senior IAS Officer Srilakshmi Gets Clean Chit in Obulapuram Mining Case,Obulapuram Mining Case,AP Cadre Senior IAS Officer,IAS Officer Srilakshmi,Mango News,Mango News Telugu,Clean Chit in Obulapuram Mining Case,Srilakshmi Clean Chit in Mining Case,AP IAS Officer Srilakshmi,IAS Officer Srilakshmi Obulapuram Mining Case,Obulapuram Mining Case Latest News And Updates,IAS Officer Srilakshmi, IAS Officer Srilakshmi News And Live Updates

ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి పెద్ద ఊరట లభించింది. ఓబుళాపురం మైనింగ్ కేసు (ఓఎంసీ)లో సీబీఐ దాఖలు చేసిన ఆరోపణలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు మంగళవారం శ్రీలక్ష్మిపై అభియోగాలను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ సీబీఐ దాఖలు చేసిన అదనపు చార్జిషీటును హైకోర్టు కొట్టివేసింది. అయితే తొలుత ఈ కేసును కొట్టివేయాలని శ్రీలక్ష్మి వేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు గత నెలలో కొట్టివేయగా ఆ తర్వాత ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తాను బాధ్యతలు స్వీకరించకముందే ఓఎంసీ లీజుపై నోటిఫికేషన్ విడుడలైందని ఆమె కోర్టు దృష్టికి తెచ్చారు.

ఇక అనంతపురంలోని బళ్లారి రిజర్వ్ ఫారెస్ట్‌లో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించడంలో సహకరించారని శ్రీలక్ష్మిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో సిబీఐ ఆమె పాత్రపై దర్యాప్తు చేసి మార్చి 30, 2012న ఆమెపై చార్జిషీట్ దాఖలు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2004 నుంచి 2009 వరకు శ్రీలక్ష్మి మైనింగ్‌ శాఖకు ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పనిచేశారు. ఈ సమయంలో శ్రీలక్ష్మి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని సిబీఐ ఆరోపించింది. కాగా ఈ కేసులో ఇప్పటికే ఆమె దాదాపు ఏడాది పాటు జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను సస్పెండ్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, అనంతరం జైలు నుంచి బెయిల్‌పై విడుదలయిన తర్వాత సస్పెన్షన్‌ను ఎత్తి వేసింది. ప్రస్తుతం ఆమె ఏపీలో విధులు నిర్వహిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 13 =