అతి త్వరలో గచ్చిబౌలిలోని శిల్ప లే అవుట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభం

GHMC Commissioner Announces Flyover Bridge at Shilpa Layout to be Opened Soon,GHMC Commissioner,Flyover Bridge at Shilpa Layout,GHMC Commissioner Flyover Bridge,Mango News,Mango News Telugu,GHMC ,Shilpa Layout Opened Soon,Shilpa Layout, Shilpa Layout Latest News And Updates,GHMC Commissioner Richa Gupta,Greater Hyderabad Municipal Corporation,Greater Hyderabad,GHMC News And Live Updates

హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. అతి త్వరలోనే గచ్చిబౌలిలోని శిల్ప లే అవుట్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించనున్నట్లు జీహెఛ్ఎంసీ కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. “గ్రేటర్ హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తోంది, దానికి అనుగుణంగా వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా జీహెచ్‌ఎంసీ కసరత్తు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ నగరం దేశంలోని మహానగరాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతోంది, తద్వారా దేశమే కాకుండా ప్రపంచం కూడా హైదరాబాద్‌ను చూస్తోంది .రాష్ట్ర ప్రభుత్వం కంపెనీల స్థాపన కోసం తన చట్టాలను సులభతరం చేసింది, అందుకే జీహెఛ్ఎంసీ కమ్యూనిటీ అవసరాలను అంచనా వేయడంతో పాటుగా మౌలిక సదుపాయాలను అందించడం ద్వారా ఆ అవసరాలను తీర్చుతుంది. రవాణాను మెరుగుపరచడం, వాహన కాలుష్యాన్ని తగ్గించడం, సిగ్నల్ రహిత రవాణా వ్యవస్థను మెరుగుపరచడం మరియు సమయానికి గమ్యస్థానానికి చేరుకోవడం కోసం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ (ఎస్‌ఆర్‌డీపీ) కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు ప్రత్యేకంగా పరిష్కరించబడుతున్నాయి” అని జీహెఛ్ఎంసీ కమిషనర్ తెలిపారు.

“గ్రేటర్ హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడానికి మరియు మెరుగైన రవాణా వ్యవస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాలు ఐటీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, కార్యాలయాలకు అంతర్జాతీయంగా పేరుగాంచిన విపరీతమైన అభివృద్ధి నేపథ్యంలో ఈ ప్రాంత రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి ఎస్‌ఆర్‌డీపీ ద్వారా అండర్‌పాస్‌లు, గ్రేడ్ సెపరేటర్లు, కారిడార్లు మరియు ఆర్వోబీలు నిర్మించబడుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ నుండి గచ్చిబౌలి వరకు ఎటువంటి సమస్యలు లేకుండా అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు సులభంగా చేరుకోవచ్చు, అయితే శిల్ప లే అవుట్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించడం వలన ట్రాఫిక్ రద్దీ లేకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లడం సులభతరం అవుతుంది. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, దుర్గం చెరువు, మైండ్‌స్పేస్, గచ్చిబౌలి, ఓఆర్ఆర్ మరియు రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుండి వచ్చే ట్రాఫిక్ ఫ్లైఓవర్ నుండి ప్రయోజనం పొందవచ్చు. ఇది ప్రధాన నగరం ద్వారా ఐఆర్ఆర్ లేదా పంజాగుట్ట నుండి ఓఆర్ఆర్ లేదా గచ్చిబౌలికి అనుసంధానం అవుతుంది” అని తెలిపారు.

“నవంబర్ చివరివారంలో శిల్పలే అవుట్ ఫ్లైఓవర్ ఓఆర్ఆర్ వరకు అప్ అండ్ డౌన్ ర్యాంప్‌లు ప్రజల వినియోగానికి సిద్ధంగా ఉంటాయి. ఇది ఓఆర్ఆర్ నుండి శిల్ప లే అవుట్ వరకు ఇప్పటికే ఉన్న గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ను దాటుతుంది. ఇందులో ఓఆర్ఆర్ నుంచి 456.64 మీటర్ల పొడవు గల 2 లేన్ అప్ ర్యాంపు, 956 మీటర్ల పొడవు గల 4 లేన్ బై డైరెక్షనల్ ఫ్లైఓవర్ శిల్పలే అవుట్ వరకు మరియు శిల్పా లే అవుట్ నుంచి ఓఆర్ఆర్ వరకు 399.952 మీటర్ల పొడవు గల 2 లేన్ డౌన్ ర్యాంపు ఉన్నాయి. పాత ముంబయి హైవేపై గచ్చిబౌలి జంక్షన్ నుండి మైండ్ స్పేస్ వరకు సర్వీస్ రోడ్డుగా పనిచేసే 473 మీటర్ల పొడవు, 2 లేన్ అప్ ర్యాంప్ ఫ్లైఓవర్ కూడా వాటి పక్కనే నిర్మించబడింది. అదేవిధంగా మైండ్ స్పేస్ నుండి గచ్చిబౌలి డౌన్ ర్యాంప్ ఫ్లైఓవర్ 2 లేన్, 522 మీటర్ల పొడవుతో నిర్మించబడింది. ఈ శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మరియు హైటెక్ సిటీల మధ్య రోడ్డు కనెక్టివిటీని పెంచుతుంది. గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. మీనాక్షి టవర్ మరియు హెచ్‌కెసి పరిసర ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 18 =