ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు ఆర్థిక సాయం

AP Govt Decides to Sanction Rs 15000 Towards Funeral Charges for the Death of Every Covid Patient,Mango News,Mango News Telugu,AP CM,CM Jagan,AP CM Jagan,AP CM Jagan Live,AP CM Jagan Speech,AP CM Jagan Live Updates,AP CM Jagan Pressmeet,Andhra Pradesh Govt Sanctions Rs 15000 For Last Rites,Andhra Govt Announces Rs 15000 To Kin Of Covid-19 Victims,Andhra Govt To Give Rs 15000 For Funeral Expenses Of Covid-19 Victims,Andhra Govt To Give Rs 15000 For Funeral,Andhra Govt To Give Rs 15000 For Funeral Expenses,Andhra Pradesh,Funeral Expenses,COVID Victims,AP Govt to Sanction Rs 15000 Towards Funeral Charges,Rs 15000 Financial Assistance For Funeral Expenses Of Covid Patient,AP Covid-19,Covid-19 In AP
కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 ఏడాదికి గాను కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు అధికారం మంజూరు చేశారు. కరోనాపై పోరుకు ప్రభుత్వం కేటాయించిన నిధుల నుంచి ఈ ఆర్థికసాయం అందించాలని కలెక్టర్లకు సూచించారు. అలాగే అవసరమైన నిధులను ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జిల్లా కలెక్టర్లకు విడుదల చేస్తారని చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =