ఏపీలో పంచాయతీ ఎన్నికలు, ఎస్ఈసీ నిర్ణయంపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్

Andhra Gram Panchayat elections, Andhra Pradesh panchayat elections, Andhra Pradesh panchayat elections News, Andhra Pradesh Panchayat Polls, Andhra Pradesh SEC, Andhra Pradesh SEC announces gram panchayat polls, AP Gram Panchayat Elections, AP Gram Panchayat Elections Schedule, AP SEC Announces Gram Panchayat Elections, AP SEC Announces Gram Panchayat Elections Schedule, Gram Panchayat Elections In AP, Mango News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో కీలక పరిణామాలు  చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసి, నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌‌ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు హైకోర్టులో హౌస్‌ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్‌ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు సోమవారం నాడు విచారణ చేపట్టనుంది.

మరోవైపు ఎన్నికల కోడ్ అమలకు సంబంధించి ఎస్ఈసీ‌ నిమ్మగడ్డ రమేశ్‌ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని, అయితే పట్టణాలు, నగరాల్లో సభలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు లబ్ది చేకూర్చే పథకాలు, పనులు చేపట్టవద్దని లేఖలో సూచించారు. పంచాయితీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో శనివారం నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =